ఇబ్బందులేమీ లేకుండా ఆనందంగా ఉండాలంటే… ”హొలీ” నాడు ఈ దేవుళ్ళని పూజించండి..!

ఇబ్బందులేమీ లేకుండా ఆనందంగా ఉండాలంటే… ”హొలీ” నాడు ఈ దేవుళ్ళని పూజించండి..!

by Megha Varna

Ads

ప్రపంచవ్యాప్తంగా హోలీ పండుగని జరుపుకుంటారు. హోలీ నాడు రంగులని జల్లుకోవడం వివిధ రకాల ఆహార పదార్థాలని తయారు చేసి తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. హోలీ నాడు చాలా మంది పూజలు కూడా చేస్తూ ఉంటారు. హోలీ హిందువుల పండగ. చెడుపై మంచి గెలిచినందుకు ఆ విజయానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటాము.

Video Advertisement

వసంతకాలం ఆగమనం శీతాకాలం ముగింపు సమయంలో ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అయితే హోలీ నాడు ఈ దేవుళ్ళకి పూజిస్తే ఎంతో మంచి కలుగుతుంది. హోలీ నాడు మరి ఏ దేవుళ్ళని ఆరాధించాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

#1. శివుడిని పూజించాలి:

హోలీ రోజు శివుడిని తప్పక పూజించాలి. హోలీ నాడు శివుడిని పూజించడం వలన కష్టాల నుండి బయటపడొచ్చు. ఆనందం కలుగుతుంది. సమస్యలు ఏమైనా ఉన్నట్టు అయితే వాటి నుండి మనం బయట పడచ్చు.

#2. విష్ణువుని పూజించాలి:

శ్రీ మహా విష్ణువుని హోలీ నాడు పూజిస్తే కూడా చాలా మంచిది. విష్ణువుని పూజించడం వలన చక్కటి ఫలితాలను పొందొచ్చు. బాధల నుండి బయట పడచ్చు.

#3. రాధా కృష్ణులని పూజించాలి:

రాధా కృష్ణులని హోలీ నాడు పూజిస్తే కూడా చాలా చక్కటి ఫలితాలను మనం పొందొచ్చు ఆనందం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం పొందొచ్చు. చాలా మంది హొలీ నాడు మొదట రాధా కృష్ణులని పూజించి ఆ తరవాత హొలీ రంగులు జల్లుకుంటారు.

#4. లక్ష్మీ దేవిని పూజించాలి:

హోలీ నాడు లక్ష్మీ దేవిని పూజించడం కూడా ఎంతో మంచిది. ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.

#5. హనుమంతుడిని పూజించాలి:

హోలీ నాడు హనుమంతుడిని పూజిస్తే బాధలన్నీ తొలగిపోతాయి మీ ఇంట ఆనందం ఉంటుంది. ఆనందం, శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం కలిగి సమస్యల కి దూరంగా ఉండచ్చు. ఇలా మీరు హొలీ నాడు ఈ దేవుళ్ళని పూజిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. సమస్యలు వుండవు.


End of Article

You may also like