Ads
బిడ్డకు జన్మనివ్వడం అనేది జీవితంలో అమూల్యమైనది. అయితే గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం, డాక్టర్లు చెప్పినట్లు అనుసరించడం చాలా ముఖ్యం.అయితే తల్లి, బిడ్డ ఇద్దరూ డెలివరీ తర్వాత క్షేమంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనట్టే అని డాక్టర్లు అంటున్నారు.
Video Advertisement
గర్భిణీలు బీపీ, షుగర్, రక్తహీనత వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. అలానే కార్బోహైడ్రేట్ మాత్రమే కాకుండా ప్రోటీన్స్ మొదలైన పదార్థాలను కూడా డైట్ లో తీసుకోవాలి.
పప్పులు, చికెన్, చేప, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి తగు మోతాదులో తీసుకోవడం గర్భిణీలకు చాలా అవసరం. మైదా, అన్నం, కూల్ డ్రింక్స్, పంచదార, జ్యూస్లు వంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అలానే బయట తీసుకునే ఆహారంలో ప్రిజర్వేటివ్స్ వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఎవరు డైట్ లో తీసుకోకండి.
మూడో నెల దాటిన తర్వాత గర్భిణీలు యోగా, వ్యాయామ పద్ధతులు పాటించడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుంది. అలానే వీటితో పాటుగా మానసికంగా గర్భిణీలు దృఢంగా ఉండాలి. మరొకరి డెలివరీ గురించి చూసి భయపడకూడదు. ఇలా తగినన్ని జాగ్రత్తలు గర్భిణీలు తీసుకుంటే తప్పకుండా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండొచ్చు.
End of Article