Ads
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినప్పటికీ చాలా మంది స్మోకింగ్ అలవాటు నుంచి బయట పడలేరు. ఈ అలవాటుకు బానిస అయిపోయిన వాళ్లు ఇబ్బంది పడడంతో పాటుగా పక్కవాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు.
Video Advertisement
మనం స్మోకింగ్ చేయకపోయినా పక్క వాళ్లు స్మోకింగ్ చేస్తున్నప్పుడు వచ్చే పొగని పీల్చడం వలన కూడా మనకి ప్రమాదం కలుగుతుంది.
స్మోకింగ్ వల్ల హృదయ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు మొదలు ఎన్నో సమస్యలు వస్తాయి. ఇదిలా ఉంటే గర్భిణీలకు కనుక స్మోకింగ్ అలవాటు ఉన్నట్లయితే రిస్క్ బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకనే స్మోకింగ్ అలవాటు ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే స్మోకింగ్ కి దూరంగా ఉండాలి.
లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణీలు స్మోకింగ్ చేసినా లేదంటే ఆ పొగ పీల్చినా పలు సమస్యలు కలుగుతాయి. అవి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
#1. గర్భిణీలు స్మోకింగ్ చేసినా లేదంటే ఆ పొగ పీల్చినా అబార్షన్ అవ్వడం, మిస్ క్యారేజ్ అవ్వడం లాంటి సమస్యలు కలుగుతాయి.
#2. హైపర్ టెన్షన్ సమస్య కూడా వచ్చే అవకాశం వుంది.
#3. లేదంటే కడుపులో బిడ్డ చనిపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
#4. అలానే స్మోకింగ్ వలన శ్వాస తీసుకోవడంలో సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు కూడా కలుగుతాయి.
#5. గర్భిణీలు స్మోకింగ్ చేస్తున్నట్లయితే బిడ్డకి గుండె సమస్యలు వంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
#6. బేబీ బరువు తక్కువగా ఉండడం, స్టిల్ బర్త్ మొదలైన సమస్యలు కూడా రావచ్చు. అలాగే ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం వుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ముందే స్మోకింగ్ కి దూరంగా ఉండండి.
అదే ఒకవేళ మీరు గర్భిణీ అయ్యి స్మోకింగ్ చేస్తున్నట్లయితే వివిధ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం, బిహేవియరల్ థెరపీ, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ వంటి వాటిని మీరు ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్మోకింగ్ కి దూరంగా ఉండడానికి అవుతుంది. అలానే సమస్యలు కూడా తొలగిపోతాయి. అదే మీరు ప్రెగ్నెంట్ కాకుండా ఇంకా ప్లాన్ చేసుకోవాలని అనుకుంటే పూర్తిగా స్మోకింగ్ మానేసి ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
End of Article