గర్భిణీలు ఈ తప్పులని చేస్తే.. ప్రమాదంలో పడినట్టే..!

గర్భిణీలు ఈ తప్పులని చేస్తే.. ప్రమాదంలో పడినట్టే..!

by Megha Varna

Ads

గర్భిణీలు తొమ్మిది నెలలు జాగ్రత్తగా ఉండాలి. అలానే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా పిల్లల పట్ల తప్పక శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అయితే గర్భిణీలు ఈ తప్పులని అస్సలు చేయకూడదు. ఈ తప్పుల్ని చేస్తే గర్భిణీలకు చాలా ప్రమాదం. ఆరోగ్య నిపుణులు గర్భిణీలు ఎలాంటి వాటిని అనుసరించాలి అనేది వివరించారు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1. పౌష్టికాహారాన్ని మాత్రమే గర్భిణీలు తీసుకుంటూ ఉండాలి. పౌష్టికాహారం తీసుకుంటే కడుపులో ఉండే శిశువు పెరుగుదల బాగుంటుంది.
#2. ఆహారం తీసుకునేటప్పుడు సమతుల్యమైన ఆహారం ని గర్భిణీలు తీసుకుంటూ ఉండాలి.
#3. తీసుకునే డైట్ లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, ఫాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి.
#4. అసలు జంక్ ఫుడ్ ని గర్భిణీలు తీసుకోకూడదు.

taking bath after having food..know this..!!
#5. బయట స్ట్రీట్ ఫుడ్ వంటివి అసలు తీసుకోకూడదు.
#6. సలాడ్స్, పండ్లు, బిస్కెట్లు వంటివి తీసుకోవచ్చు.
#7. గర్భిణీలకి వికారం ఎక్కువగా ఉంటుంది అటువంటప్పుడు ఇటువంటి స్నాక్స్ ని ప్రిఫర్ చేస్తే మంచిది.
#8. ఉద్యోగం చేసే వాళ్ళైతే ఎక్కువసేపు వర్క్ చేయడం వలన వెన్ను నొప్పి, కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి.  కాబట్టి వీలైనంత వరకు వర్క్ చేయకుండా వుండండి. కుదరదంటే మధ్య లో గ్యాప్స్ తీసుకోవడం మంచిది.
#9. అలానే ఎక్కువసేపు పనిలో ఉండడం వలన గర్భిణీలకు మరో ప్రమాదం ఉంది పిండంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని మూలంగా శిశువు ఎదుగుదల మందగిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


#10. అదే విధంగా అధిక బరువులు ఎత్తడం వంటివి చేయకూడదు.
#11. బరువు ఎత్తడం, వెంటనే లేవడం వంటివి అసలు చేస్తే కూడా ఇబ్బంది పడాలి.
#12. ఒత్తిడి అస్సలు తీసుకోకూడదు. స్ట్రెస్ వలన కూడా మీ ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది.

 


End of Article

You may also like