ప్రేమిస్తే భ‌ర‌త్ నటించిన “లవ్” మూవీ చూశారా..? ఎలా ఉందంటే..?

ప్రేమిస్తే భ‌ర‌త్ నటించిన “లవ్” మూవీ చూశారా..? ఎలా ఉందంటే..?

by kavitha

ప్రేమిస్తే మూవీతో సౌత్ ఇండస్ట్రీలో భరత్ సంచలనం సృష్టించారు. ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా, భరత్ కు హీరోగా మంచి క్రేజ్ ఏర్పరచింది. కోలీవుడ్ హీరో భరత్ ఆ మూవీ హిట్ అవడంతో  తెలుగులో కూడా ఫాలోయింగ్ వచ్చింది.

Video Advertisement

ప్రేమిస్తే తరువాత భరత్ నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యి, పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. భరత్ హీరోగా నటించిన 50వ మూవీ లవ్. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భరత్ తమిళ, మలయాళం, హిందీ, తెలుగు భాషలలో హీరోగా, సైడ్ హీరోగా పలు చిత్రాల్లో నటించారు. 2020 లో  మలయాళంలో విజయం సాధించిన లవ్ మూవీని అదే టైటిల్ తో భరత్ హీరోగా తమిళంలో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో వాణిభోజ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ ఏడాది జూలై 28న రిలీజ్ అయిన ఈ మూవీకి ఆర్పీ బాల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 8 నుండి ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ ప్రముఖ ఓటీటీ ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, అజ‌య్‌, దివ్య ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లి వద్దని దివ్య తండ్రి వ‌ద్ద‌ని ఎంతగా చెప్పినా వినకుండా అజ‌య్‌ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లైన సంవత్సరంలోనే ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభం అవుతాయి. అజ‌య్ చేస్తున్న బిజినెస్‌లో నష్టాలు రావ‌డంతో, మద్యానికి బానిస‌ అవుతాడు. అదే సమయంలో దివ్య గర్భవతి అని తెలుస్తుంది. చెక‌ప్‌ కోసం దివ్య హాస్పటల్ కి వెళుతుంది.
అజ‌య్‌ ఇంట్లోనే తాగుతూ ఉంటాడు. దివ్య కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో దివ్య అతని పై సీరియ‌స్ అవుతుంది. అతనిలో మార్పు రాద‌ని శాశ్వ‌తంగా అతని నుండి వెళ్లిపోవ‌డానికి సిద్ధం అవుతుంది. అజ‌య్‌ ఎంతగా క‌న్వీన్స్ చేసినా దివ్య అత‌ని మాట విన‌దు. దాంతో కోపం వచ్చిన అజ‌య్‌ దివ్య‌ను నెట్టేస్తాడు. ఆమెకు దెబ్బ బలంగా త‌గ‌ల‌డంతో అక్కడిక్కడే చ‌నిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అజ‌య్‌ లైఫ్ లో ఏలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన కథ.

Also Read: SALAAR REVIEW : “ప్రభాస్” ఈ సినిమాతో హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


You may also like

Leave a Comment