మారుతున్న రోజుల్లో ప్రతిదీ అమ్మకానికి వస్తువు అయిపోతోంది. పెరట్లో ఓ చెట్టు పెట్టుకుంటే వచ్చే ఆకుకి నేడు ఆన్ లైన్ లో అంత ఖరీదు పెట్టాల్సి వస్తోంది. ఒకప్పుడు అరటి చెట్టు లేని పెరటి ఉండేదే కాదు. ఎందుకంటే.. అప్పుడు అరటి ఆకే నిత్యావసరం. బోజనాలను ఆ ఆకులలోనే చేసేవారు. ఇంట్లో అన్నం తినాలి అనుకుంటే చాలు.. పెరటిలోకి వెళ్లి ఒక ఆకుని తుంపుకొచ్చేయడమే.

banana leaf online

కానీ రోజులు మారిపోయాయి. అరటి ఆకులు పోయి స్టీల్ ప్లేట్స్ వచ్చాయి. ఎప్పుడైనా ఫంక్షన్స్ వంటి చోట్ల పేపర్ ప్లేట్స్ లేదా విస్తరాకులు వేయడం అలవాటు గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పెరట్లు, వాటిల్లో అరటి చెట్లు ఉండట్లేదు మరి. ప్రస్తుతం వీటిని కూడా ఆన్ లైన్ లో కొనుక్కోవాల్సి వస్తుంది. ఐదు ఆకులకు 50 రూపాయలు చెల్లించాలి. వీటిని ఇంటి దగ్గరకే డెలివర్ చేస్తారు. డెలివరీ కి చార్జీలు అదనం గా చెల్లించాలి. ప్రస్తుతం ఈ ధరల తాలూకు ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.