Ads
ప్రియా ఆనంద్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు..! రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇస్తూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘లీడర్'( 2010) చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
Video Advertisement
అటు తర్వాత రామ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’, సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన ‘180’ , శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘కో అంటే కోటి’ వంటి క్రేజీ చిత్రాల్లో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది.
అందం, అభినయం కలిగిన ఈ నటి..తమిళంలో బిజీ అవ్వడంతో పదేళ్ళ పాటు టాలీవుడ్ కు దూరమైంది. తెలుగులో ఈమెకు మంచి క్రేజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. దాదాపుగా మీడియాకి దూరంగా ఉండే ప్రియా ఆనంద్ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో వార్తలలో నిలిచారు. నాకు నిత్యానందని పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె ఈ కామెంట్స్ ఏ సందర్భంలో చేసారో ఇప్పుడు చూద్దాం.
గత కొన్ని రోజులుగా ప్రియా తన సోషల్ మీడియా ఖాతాల్లో నిత్యానంద సూక్తులను షేర్ చేస్తున్నారు. ఈ విషయాన్నే ఓ నెటిజెన్ ప్రశ్నించగా “నాకు నిత్యానంద అంటే ఇష్టం.. ఆయనని ద్వేషించే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆయనను ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు. నాకు ఆయనని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఒకవేళ చేసుకుంటే.. నాకు పేరు మార్చుకోవాల్సిన అవసరం కూడా రాదు.. మా ఇద్దరి పేర్లు ఇంచుమించు ఒకలానే ఉంటాయి” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
End of Article