ప్రియా ప్రకాష్ వారియర్… ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది ఈ మలయాళీ భామ. ఆమె అదృష్టం అలా కుదిరినా.. తర్వాత ఆమె నటించిన ‘ఒరు అదార్ లవ్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.

Video Advertisement

ఇక ఆ తర్వాత కూడా ఈ భామ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. వైరల్ గా మారిన ఈ ఫోటోలను చూసి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.


ఒక్కసారి కన్ను గీటటంతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఈమె లేటెస్ట్ గా సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు చూసి.. ప్రియా వారియర్ ఏంటి ఇలా అయిపోయింది.. అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

priya prakash varrier latest pics
వింక్ గర్ల్ గా గుర్తింపు పొందిన ఈ కేరళ కుట్టి… చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రియా వారియర్… సోషల్ మీడియాలో 7.1 మిలియన్ ఫాలోవర్స్‌తో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

priya prakash varrier latest pics

 

మోడలింగ్ చేస్తూ… బ్యూటీ పేజెంట్స్‌లో ర్యాంప్ వాక్‌తో కట్టిపడేస్తోంది. అది అలా ఉంటే.. తెలుగు లో ప్రియా, నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా వారియర్ ఆశలకు ఈ సినిమా బ్రేకులు వేసింది. ఆ తర్వాత తేజ సజ్జ తో ఒక సినిమా చేసిన ఆశించిన ఫలితం రాలేదు.

priya prakash varrier latest pics

2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి… సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా… అదీ మెప్పించలేదు. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ ఓ రెండు హిందీ చిత్రాలతో పాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తున్నారు.