బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పవర్ఫుల్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా ఎలాంటి విషయం లో అయినా డేర్ గానే ఉంటారు. విభిన్నమైన దుస్తుల్లో కనిపించి అలరించడం ఆమెకు పరిపాటి. ఇటీవల.. ఆమె భర్త నిక్ జోనస్ తో ఆమె కలిసి నడుస్తున్న సమయం లో వెనక నుంచి ఫోటో క్లిక్ మనిపించారు.ఈ ఫోటోను నిక్ జోనస్ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ ఫోటో లో వారి కెమిస్ట్రీ తో పాటు.. ప్రియాంక జాకెట్ పై ఉన్న బొమ్మ కూడా బాగా పడింది.

Video Advertisement

priyanka chopra

దీనితో అభిమానులంతా దానిగురించి చర్చించుకుంటున్నారు. ప్రియాంక జాకెట్ పై కాళికా మాత కనిపిస్తోంది. పవర్ఫుల్ దుస్తులను ధరించడం లో ప్రియాంకకు సాటిలేరని కొందరు ప్రశంసిస్తుండగా.. దేవతల చిత్రాలను దుస్తులపై ధరించవద్దంటూ మరికొందరు హితవు చెప్తున్నారు. అయితే.. మరికొందరు మాత్రం డిజైన్ బాగుంది.. డిజైనర్ ఎవరు అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొత్తానికీ.. ఈ ఫోటో మాత్రం నెట్టింట్లో సందడి చేస్తోంది.