చాణక్య నీతి: ఇలాంటి డబ్బుని పొరపాటున కూడా ముట్టుకోవద్దు.. అదెప్పటికీ ప్రమాదమే..!

చాణక్య నీతి: ఇలాంటి డబ్బుని పొరపాటున కూడా ముట్టుకోవద్దు.. అదెప్పటికీ ప్రమాదమే..!

by Megha Varna

Ads

ఆచార్య చాణక్యుడు రచించిన పుస్తకాలు ఇప్పటికీ కూడా అనుసరణీయమే. ఆచార్య చాణుక్యుడు ఆర్థిక సూత్రాల గురించి కూడా వివరించడం జరిగింది. గతంలో ఎలా ఉన్నాయో నేటి కాలంలో కూడా చాలా సందర్భోచితంగా ఉన్నాయి. తెలివి తేటలకు ఆచార్య చాణక్యుడు ప్రసిద్ధి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకి రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో కూడా తెలుసు. ఆయన తనకి తెలిసిన విషయాలను ఒక పుస్తక రూపంలో ఇచ్చారు.

Video Advertisement

సమాజంలో ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి ఆయన నీతిని రూపొందించారు. నిజంగా ఆచార్యుడి విధానాన్ని పాటిస్తే ఎవరైనా తప్పక విజయ శిఖరాలను చేరుకోగలరు. కానీ ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆయన అడుగుజాడల్లో ఆయన విధానాలలో అనుసరించే వాళ్ళు చాలా తక్కువ. నిజంగా ఆచార్య చాణక్యుడు విధానాలని అనుసరిస్తే ప్రతి ఒక్కరు కూడా విజేతలు అవుతారు. ఆయన ఎలాంటి ధనం జీవితంలో సంపాదించాలి..? ఎటువంటి డబ్బుని మనం ఆర్జించాలి అనేది వివరించారు. వాటి గురించి ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఇలాంటి డబ్బును అస్సలు సంపాదించుకూడదని ఆయన చెప్పారు.
ఎవరినైనా మోసం చేసి దాని ద్వారా డబ్బు సంపాదిస్తే అది అస్సలు సమస్యల్లో ఉన్నప్పుడు పని చేయదు. అంతే కాదు గౌరవం కూడా దెబ్బతింటుంది.


అలానే ముఖస్తుతి ద్వారా సంపాదించిన సంపద పూర్తిగా పనికిరాదు. ఎందుకంటే ఇటువంటి సంపద ఉంటే అవమానాన్ని భరించాలి. ఒకరిని హింసించి ఆర్జించే సంపద ఎప్పటికి ఉపయోగపడదు. అలాంటి డబ్బులు సంపాదిస్తే శారీరక, మానసిక బాధలు తప్పవు అని ఆచార్య చాణిక్యుడు చెప్పడం జరిగింది.


End of Article

You may also like