వేరుశనగ రుచిగా ఉంటుంది. స్నాక్స్ కిందైనా సరే దీనిని మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో వేడి వేడి పల్లీలని ఉడకబెట్టుకుని దానిలో ఉప్పు, కారం, ఉల్లి వేసుకుని తింటే మరింత రుచికరంగా ఉంటుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ లిమిట్ గా తీసుకుంటే దీని వలన చక్కటి లాభాలని మనం పొందొచ్చు. అయితే ఎక్కువ మోతాదులో వేరుశనగను తీసుకోవడం వల్ల సమస్యలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మరి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
వేరుశెనగలలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్లు వంటి మొదలగు పోషక విలువలు ఉంటాయి. అందువల్ల వేరుశెనగలను అధిక మోతాదులో తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు మరియు జీర్ణ ప్రక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా ఎసిడిటి ఉన్నవారు వేరుశనగలు తీసుకోకూడదు. వీటిలో ఉండే లెక్టిన్ లు వల్ల నొప్పి మరియు మంట పెరుగుతుంది, కాబట్టి కీళ్ల నొప్పులు సమస్యలు ఎక్కువగా ఉంటే వేరుశనగలకు దూరంగా ఉండటమే మేలు. వేరుశెనగలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అఫ్లటాక్సిన్ పరిమాణం పెరుగుతుంది.
దాంతో కాలేయ ఆరోగ్యం దెబ్బ తింటుంది. వీటితో పాటు వేరుశెనగలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే నోటి పుండ్లు, అలర్జీలు మరియు మలబద్ధకం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పరిమితికి మించి వేరుశనగను తీసుకోకండి.