కోలీవుడ్ స్టార్‌ విజయ్ దళపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లియో దసరా సందర్బంగా 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ లో విజయ్ కి ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. యావరేజ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వందల కోట్ల సాధించడం పరిపాటిగా వస్తుంది.

Video Advertisement

విజయ్‌ దళపతి, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాలలో లియో ఒకటి. రిలీజ్ దగ్గర పడుతున్నకొద్ది విజయ్ మూవీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ లియో. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ సర్జా, సంజయ్ దత్, కీలకపాత్రలలో నటించారు. కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై భారీ హైప్ ఏర్పడింది. అయితే ఈ మూవీ మొదటి సాంగ్ రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఈ చిత్రం పలు సమస్యలను ఎదుర్కొంటూ వస్తుంది.
# స్మోకింగ్ సమస్య: మొదటి పాట నా రెడీ రిలీజ్ అయ్యింది. ఈ పాట రిలీజ్ అయిన 5 రోజుల్లోనే యూట్యూబ్‌లో 33 మిలియన్ల వ్యూస్‌ను మరియు 1.9 మిలియన్ లైక్స్‌ను సాధించింది. ఈ పాటకు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలో విజయ్ దళపతి స్మోక్ చేస్తారు. విజయ్ స్మోక్ చేయడం వివాదాస్పదం అయ్యింది. ఈ విషయం పై పలువురు కేసు వేశారు.
#లిరిక్స్ సమస్య: లియో మూవీలోని ఫస్ట్ సింగిల్  నా రెడీ లిరిక్స్ కూడా వివాదాస్పదం అయ్యింది. ‘ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం మరియు రౌడీయిజాన్ని పొగుడుతూ’ తీశారని, విజయ్‌ పై చర్య తీసుకోవాలని తమిళనాడులో ఫిర్యాదు దాఖలైంది.

#ట్రైలర్ సమస్య: ఇటీవల రిలీజ్ అయిన లియో ట్రైలర్ లో అసభ్యకరమైన పదాలను ఉపయోగించడం వివాదాస్పదం అయ్యింది.#ఆడియో లాంచ్ ఈవెంట్: లియో మూవీ ఆడియో మరియు ప్రీరిలీజ్ ఈవెంట్లు కలిపి ప్లాన్ చేశారు. కానీ పలు కారణాలతో  ఆ ఈవెంట్ రద్దు అయ్యింది.

#స్పెషల్ షోలు క్యాన్సిల్: లియో మూవీ ప్రత్యేక షోలు కూడా క్యాన్సిల్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు.

#ప్రీమియర్ షోలు క్యాన్సిల్: లియో మూవీ ప్రీమియర్ షోలు రద్దు చేయబడ్డాయి. ఈ షోలకోసం టికెట్ కొనుగోలు చేసినవారికి వారి డబ్బును రీఫండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: “బాలకృష్ణ” తో జత కట్టిన ఈ 13 మంది హీరోయిన్స్ కి… బాలకృష్ణకి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?