భార్య భర్తల మధ్య సమస్యలు రావడం సహజం. చాలా మంది ఇళ్లల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే సర్దుకుపోతే సమస్యలు వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. అంతే కానీ సమస్యను పట్టుకుని వేలాడుతూ ఉంటే పరిష్కారం దొరకదు.

Video Advertisement

అయితే భార్య భర్తల మధ్య ఇబ్బందులు తొలగించుకోవాలంటే వాస్తు పండితులు చెప్పిన చిట్కాలను అనుసరించాలి.

#1. భార్య భర్తల మధ్య సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరం అయ్యి పాజిటివిటీ కలుగుతుంది. ఎలానో మనం నిత్య పూజ లో కర్పూరం వెలిగిస్తూ ఉంటాము. ఇలా అయినా సరే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని.. గొడవలు వంటి రావు అని అంటున్నారు. పైగా కర్పూరం వలన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

#2. ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి. ఒకవేళ భార్యాభర్తల మధ్య గొడవలు వున్నా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వున్నా ఇలా చేయడం మంచిది.

#3. బెడ్ రూమ్ లో సమస్యలు వస్తే బెడ్ రూమ్ లో కాస్త కర్పూరాన్ని వెండి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ వేసి వెలిగించండి ఇది కూడా నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించి మీ బంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. ఒకవేళ కర్పూరం వెలిగించక పోయినా కర్పూరాన్ని గదిలో ఉంచుకున్నా కూడా మంచిది.

#4. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే నేతిలో కర్పూరం వేసి వెలిగించండి. దీనితో వాస్తు దోషాలు తొలగిపోతాయి.

#5. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే లవంగాలను కర్పూరం తో పాటు కాల్చి వెలిగించండి ఇది ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది.

#6. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి కూడా కర్పూరం సాయం చేస్తుంది. క్రిమికీటకాలను కూడా నాశనం చేస్తుంది.

చూశారు కదా దీని వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. మరి రెగ్యులర్ గా ఈ పద్ధతిని ఫాలో అయ్యిఇబ్బందులు లేకుండా ఉండండి. ఆనందంగా జీవించండి. చక్కగా ఐకమత్యంగా ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండండి.