Ads
చాలామంది తల స్నానం చేసి తడి తలతోనే నిద్రపోతూ ఉంటారు. ఎక్కువగా ఆడవాళ్ళు తల స్నానం చేసి తడి జుట్టుతో నిద్రపోతూ ఉంటారు. అయితే నిజానికి తడిసిన జుట్టు బలహీనంగా ఉంటుంది. ఒకవేళ కనుక మీరు తడి తలతో పడుకుంటే జుట్టు ఊడిపోతుంది. తడి జుట్టుని ఎప్పుడూ కూడా వెంటనే తుడుచుకుంటూ ఉండాలి.
Video Advertisement
నిజానికి తడి జుట్టుతో నిద్ర పోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నిజంగా తన జుట్టు వల్ల సమస్యలు వస్తాయా..? ఎటువంటి సమస్యలు వస్తాయి అనే విషయాలను చూద్దాం.
#1. చుండ్రు సమస్య వస్తుంది:
తడి జుట్టు తో నిద్ర పోవడం వల్ల చుండ్రు సమస్య మరింత ఎక్కువైపోతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల జుట్టు కి గాలి తగలదు. దీని వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పైగా మనం తలకింద దిండు పెట్టుకుంటూ ఉంటాము. దీంతో దిండు తడిగా అయిపోయింది. బ్యాక్టీరియా త్వరగా దిండు కి ఎట్రాక్ట్ అవుతుంది. ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్ కి దారి తీస్తుంది.
#2. మొటిమలు వస్తాయి:
ఇలా బ్యాక్టీరియా కి గురైన దిండు ముఖానికి తగలడం వలన మొటిమలు వస్తాయి కాబట్టి ఎప్పుడూ తడి తలతో నిద్రపో కండి.
#3. ఇమ్యూనిటీ పై ఎఫెక్ట్ పడుతుంది:
తడి జుట్టుతో నిద్రపోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనమవుతుంది.
#4. జుట్టు రాలిపోతుంది:
తడి జుట్టు మీద నిద్రపోవడం వల్ల జుట్టు చిక్కుపడి జుట్టు రాలిపోతుంది కూడా.
#5. జలుబు చేస్తుంది:
ఇలా తడి జుట్టుతో నిద్ర పోవడం వల్ల జలుబు కూడా వస్తుంది.
#6. రాలిపోతుంది కూడా:
తడి జుట్టు తో మంచం మీద పడుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే జుట్టు తెగిపోతుంది. జుట్టు చిట్లి పోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి కచ్చితంగా తల స్నానం చేసిన తర్వాత జుట్టుని బాగా తుడవండి లేదంటే ఒకసారి హెయిర్ డ్రయర్ తో జుట్టుని ఆరబెట్టండి.
End of Article