“సమంత” స్థానం లో “రష్మిక”..వైరల్ అవుతున్న నిర్మాత కామెంట్స్..!!

“సమంత” స్థానం లో “రష్మిక”..వైరల్ అవుతున్న నిర్మాత కామెంట్స్..!!

by Anudeep

Ads

‘శాకుంతలం’ మూవీలో దుష్యంతుడుగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు మళయాల నటుడు దేవ్ మోహన్ . ఫస్ట్ మూవీ లోనే సమంత వంటి టాప్ హీరోయిన్ తో యాక్ట్ చేసే అవకాశం అందుకున్న దేవ్ ఇప్పుడు శాకుంతలం విడుదల కాకుండానే రెండో సినిమాకు సైన్ చేసి తెలుగులో వేగంగా అడుగులు వేస్తున్నాడు.

Video Advertisement

 

 

తాజాగా దేవ్ మోహన్ రెండో సినిమా ‘రెయిన్ బో’ ముహూర్తం జరుపుకుంది. ఈ చిత్రంలోనూ అతను నేషనల్ క్రష్ అనిపించుకున్న రష్మిక మందన్నతో నటించబోతుండటం విశేషం. ఇక రష్మిక ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన కొద్ది కాలం లోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు అడుగులు వేస్తోంది రష్మిక.

producer comments on samantha replacement in rainbow movie..!!

ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌ ప్రభు, ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు జస్టిన్‌ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఇదిలా ఉంటే రెయిన్‌ బో చిత్రానికి ఫస్ట్‌ చాయిస్‌ రష్మిక కాదని తెలుస్తోంది.

producer comments on samantha replacement in rainbow movie..!!

ఫీ మేల్ సెంట్రిక్‌ ఫాంటసీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ 2021 అక్టోబర్‌లోనే ప్రకటించగా.. సమంత ని లీడ్ రోల్ లో ప్రకటించారు కూడా. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. సుమారు 17 నెలల తర్వాత మేకర్స్‌ సమంత ప్లేస్‌లో రష్మికను రీప్లేస్‌ చేశారని ఇన్‌సైడ్‌ టాక్‌.

producer comments on samantha replacement in rainbow movie..!!

అయితే ఈ విషయం పై నిర్మాత ప్రభుని అడగ్గా.. ” ఒక మూవీ స్క్రిప్ట్ కి ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసుకుంటాం. మేము ఫ్లో ని మార్చాలి అనుకోవట్లేదు. కంటెంట్, కర్మ అలా జరుగుతూ ఉంటాయి.. వాటిని ఎవరు మార్చలేరు.” అంటూ కామెంట్స్ చేయగా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అప్పుడు సామ్ ని హీరోయిన్ గా ప్రకటించి.. ఇప్ప్పుడు మార్చడమే కాకుండా.. ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటంటూ సామ్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.


End of Article

You may also like