‘ఏమాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత తన కృషి, పట్టుదలతో క్రమంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలకు దూరమవుతుంటారు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా ప్రాధాన్యమున్న చిత్రాలు చేసింది. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న సామ్.. ఆ తర్వాత తనకు మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందంటూ ప్రకటించి ఫాన్స్ ని షాక్ కి గురి చేసింది.

Video Advertisement

తాజాగా యశోద చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సామ్. త్వరలో ఖుషి, శాకుంతలం చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనుంది. తాజాగా విడుదలైన శాకుంతలం ట్రైలర్ తో సామ్ అందరి మనసులు గెలుచుకుంది. అయితే గుణశేఖర్ దర్శకత్వం లో రానున్న ఈ చిత్రం పురాణాల ఆధారం గా రూపొందించారు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి-గుణా టీమ్‌ వర్క్స్‌ పతాకంపై గుణశేఖర్‌ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్‌ మోహన్‌ దుష్యంతుడుగా నటిస్తున్నారు.

producer critisizes samantha..

అయితే సమంత నటించిన యశోద సినిమా విడుదల సమయంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ తర్వాత మళ్లీ కెమెరా కంటికి కనిపించని సమంత మళ్ళీ ఇప్పుడే కనిపించారు. ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయింది. అంతేకాకుండా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంది. అయితే సమంత ఇలా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆమె పరిస్థితి చూసి అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. అయితే సమంత ఏం చేసినా కూడా కొంతమంది పని కట్టుకొని మరి ఆమెను ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక నిర్మాత కూడా ఆమె ఆమెను విమర్శించడం వైరల్ గా మారింది.

producer critisizes samantha..
ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టి బాబు సమంత ఏడవటం గురించి మాట్లాడుతూ..” ఎవరి కోసం సమంత ఏడుస్తుంది, ఆమె ఏమైనా సంఘ సేవ చేసి కష్టాలు పడుతుందా.. డబ్బులు తీసుకొని సినిమా చేసింది. సినిమాల ప్రమోషన్ కోసం సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోంది. సమంతకు వచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనది ఏమి కాదు. ఒక వేళ ఆరోగ్యం అంత బాగోక పోతే ఈ ఈవెంట్ కి రాకుండా ఉండాల్సింది.” అన్నారు. ఇక చిట్టి బాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.