మన గత జన్మకి సంబంధించిన గుర్తులు ఎలా ఉంటాయి..? ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారు..?

మన గత జన్మకి సంబంధించిన గుర్తులు ఎలా ఉంటాయి..? ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారు..?

by kavitha

Ads

పునర్జన్మ ఉందా లేదా అనే దాని పై చాలా పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఇది అపోహ కొట్టి పారేస్తే, మరి కొందరు ఇది నిజమే అని నమ్ముతున్నారు. మనిషి చనిపోయిన తరువాత ఆ ఆత్మ మరొక  శరీరముతో మళ్ళీ జన్మిస్తుందని హిందువులు విశ్వాసం.

Video Advertisement

అయితే పునర్జన్మ ఉంటుంది అని సైన్స్ చెప్తోంది. దీని పై కొందరు శాస్త్రవేత్తల పరిశోధనలు జరిపారు. పునర్జన్మ ఉందని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనిషి గత జన్మకి సంబంధించిన గుర్తులు ఎలా ఉంటాయి? ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Reincarnationమనిషి గత జన్మకి సంబంధించిన గుర్తులను కొంతమంది ఫిలాసఫికల్ సైంటిస్టులు కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి కనుగొన్నారు. వాటివల్ల పునర్జన్మ ఉందని చెబుతున్నారు.

1. డెజావు

ఏదైనా ఒక సంఘటన జరిగినపుడు మీరు కొత్తగా ఫిల్ అవడమో, లేదా ఏదైనా వాయిస్ విన్నప్పుడు లేదా మ్యూజిక్ విన్నప్పుడు లేదా కొత్త ప్రదేశాన్ని కానీ, కొత్త మనిషిని కానీ కలిసినపుడు మీ మనసులో ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ మొదలవుతుంది. ఈ ఫీలింగ్ నే డెజావు అంటారు. ఆ భావ కలిగితే మీకు గత జన్మ ఉందని అర్ధం.

2. విచిత్ర జ్ఞాపకాలు:
కొంతమంది పిల్లలకి కొన్ని విచిత్రమైన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ వాళ్ళు వాటిని రాత్రిపూట వచ్చిన కలలుగా అనుకుంటారు. కానీ అవి వాళ్ళ గత జన్మకి సంబంధించిన గుర్తులు.

3. కలలు:
మీకు వచ్చే కలలలో అన్ని ఫాంటసీ కాదు. కొన్ని మీ గత జన్మకు సంబంధించిన క్లూస్.
4. ఫియర్స్ మరియు ఫోబియా:

అందరికి ఉండే సహజమైన భయాలు కాకుండా, కొందరు నీళ్లను, పక్షులను, నంబర్లను, మిర్రర్స్, మొక్కలను, కొన్ని రంగులను చూసి భయపడుతుంటారు. గత జన్మలో వాటివల్ల మరణం కలిగిందేమో అని అంటున్నారు.

5. విదేశీ కల్చర్ అంటే ఆకర్షణ:

కొంతమంది విదేశీ కల్చర్ కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. వారి దగ్గర డబ్బులు లేకపోయినా బ్రాండ్ వస్తువులు వాడుతూ, లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటారు. అంటే వీరు గత జన్మలో ఫారెన్ లో పుట్టి పెరిగి ఉండవచ్చు.

6. కోరికలు:

కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి. బుక్స్ చదవడం, కథలు రాయడం, సంగీతం అంటే ఇష్టపడుతారు. వాటిలో కొన్ని గత జన్మకు సంబంధించినవి కావచ్చు.7. అన్ కంట్రోలబుల్ హాబిట్స్:

సాధారణంగా మనలో ఏదైనా బ్యాడ్ హాబిట్ ఉంటుంది. అది గోర్లు కొరకడం, కబుర్లు చెప్పడం, టీవి, ఫేస్ బుక్, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడడం. పునర్జన్మను నమ్మే వారు వీటిని గతజన్మకు సంబంధించినవిగా చెప్తారు.

8. బర్త్ మార్క్స్:

శరీరం మీద ఉండే కొన్ని మచ్చలు మనకు పునర్జన్మ ఉందని చెబుతాయని ఒక సంఘటన నిర్దారించింది. మహా రామ్ అనే అబ్బాయి తనను గత జన్మలో ఎవరో ఒక వ్యక్తి తనను గన్ తో కాల్చడని చెప్పాడు. దానికి గుర్తుగా ఆ అబ్బాయి చెస్ట్ పై ఒక మచ్చ ఉంది. ఆ స్టోరీ చెక్ చేసినపుడు మహా రామ్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి చనిపోయినట్టు ప్రూవ్ అయ్యింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.
ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఎలా పుడతారంటే.. 

1. వివాహేతర సంబంధం: 

ఎవరు అయితే ఇతరులతో అక్రమ సంబాధలు పెట్టుకుంటారో వాళ్ళని నరకలోకంలో బాగా శిక్షిస్తారు. ఆ తరువాత వారు వచ్చే జన్మలో తోడేలుగా, ఆ తరువాత రాబంధుగా, ఆ తరువాత పాముగా, ఆ తరువాత కొంగ పుడతారు.

2. పెద్దవారిని గౌరవించక పోవడం:

పెద్దవారిని గౌరవించని వారు వచ్చే జన్మలో కాకిగా పుడతారు. అలా కాకిగా పది ఏళ్లు బ్రతకాలి.

3. బంగారం దొంగిలించడం:

బంగారాన్ని దొంగతనం చేస్తే వ్యాస మహర్షి చెప్పినట్టుగా వచ్చే జన్మలో కీటకంగా పుడతారు. ఒకవేళ వెండిని దొంగతనం చేస్తే పావురంగా పుడతారు.

4. ఇతరుల వస్తువులు దొంగిలించడం:

ఇతరుల వస్తువులను దొంగతనం చేస్తే వచ్చే జన్మలో చిలుకగా పుడతారు. అలా వారి జీవితాంతం వరకు పంజరంలో ఉండాల్సి వస్తుంది.

5. ఇతరులను చంపడం:

ఇతరులను చంపితే వచ్చే జన్మలో గాడిదగా పుడతారు. వాళ్ళు జీవితాంతం వారి యజమానికి సేవ చేసుకుంటూ బ్రతకాలి.

మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే క్రింద ఉన్న వీడియోని చూడండి.

watch video: 

Also Read: చంద్రయాన్-3 పంపడానికి ముహూర్తం ఎలా డిసైడ్ చేస్తారో తెలుసా..? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..?

 


End of Article

You may also like