“జీవితం లో సగం గొడవలకు కారణం మనమే..”: పూరి జగన్నాథ్

“జీవితం లో సగం గొడవలకు కారణం మనమే..”: పూరి జగన్నాథ్

by Anudeep

Ads

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘లైగర్’ సినిమా పరాజయం తో డాషింగ్ డైరెక్టర్ పూరి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయ్యారు. కాగా ‘పూరీ మ్యూజింగ్స్‌’ పేరుతో చేసే పాడ్‌కాస్ట్‌లకు కూడా కొంత విరామం ఇచ్చిన ఆయన తాజాగా మళ్లీ ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నో విభిన్న కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు వినిపించిన ఆయన ఈసారి తడ్కా గురించి చెప్పారు.

Video Advertisement

 

ఎన్నో రకాల కాన్సెప్ట్‌లతో పాడ్‌క్యాస్ట్‌ వినిపించిన ఆయన ఈసారి ‘తడ్కా’ గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు. అంటే ఆయన వంటల గురించి మాట్లాడారు అనుకుంటే పొరపాటే. ఆయన మన జీవితాల్లోని తడ్కా ల గురించి మాట్లాడారు.

puri jagannath comments about life goes viral..!!

‘‘మనం అప్పుడప్పుడు ఏదైనా పనికోసం ఓ మనిషిని మరో మనిషి దగ్గరకు పంపిస్తాం. అతను తిరిగొచ్చి అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా.. మిగిలినవ్నీ చెబుతాడు. ఏం జరిగింది? అని అడిగితే.. ‘మంచి రోజులు కావన్నా. నువ్వు ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నాలుగు డబ్బు వచ్చేసరికి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు అయితే కొడతావ్‌’ అని మనం పంపించిన మనిషి జవాబిస్తాడు. కాదురా ఇంతకీ వాడు ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే.. ‘డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు’ అన్నా అని బదులిస్తాడు. అక్కడ పెనంలో ఉన్న దాన్ని ఇక్కడకి తీసుకొచ్చేలోపు మనుషులు తాలింపు వేసి తీసుకొస్తారు.” అని పూరి తెలిపాడు.

puri jagannath comments about life goes viral..!!

“తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగం గొడవలు ఇలాగే తడ్కా వల్లే వస్తాయి. ఇక్కడ మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా.. లేక వారికి నచ్చింది చెబుతున్నారా.. అన్నది మనం చూసుకోవాలి. ఆ మధ్యవర్తులు ఎవరో కాదు మనమే. ప్రతి ఒక్కరూ తడ్కా స్పెషలిస్ట్. తడ్కా లేకుండా ఎవరూ మన దగ్గరకు ఏ వంటకాన్నీ తీసుకురారు. ఇప్పుడు మనం ఎంత స్మార్ట్‌గా ఉంటున్నామో తడ్కా అలానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం’’ అని పూరీ జగన్నాథ్‌ పేర్కొన్నారు.


End of Article

You may also like