లాక్ డౌన్ లో ఎక్కువమంది విడాకులు తీసుకోడానికి కారణం ఇదే అంట.?

లాక్ డౌన్ లో ఎక్కువమంది విడాకులు తీసుకోడానికి కారణం ఇదే అంట.?

by Anudeep

Ads

పూరి సినిమాలలో కచ్చితం గా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. ఎందుకంటే పూరి అనుభవాల్లోంచే పాఠాలను నేర్పిస్తాడు. ఇటీవల తనకు తెలిసిన విషయాలను యూట్యూబ్ వేదిక గా “పూరి మ్యూజింగ్స్” పేరిట చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి వివాహబంధాన్ని, విడాకులకు కారణాన్ని విశదీకరిస్తూ పూరి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.

Video Advertisement

puri 1

ఇందుకు ఓ ఉదాహరణ చెబుతూ.. లాక్ డౌన్ కి ముందు కొత్త గా పెళ్ళైన ఓ జంట హనీమూన్ కి మాల్దీవులకు వెళ్లారని, ఐతే లాక్ డౌన్ కారణం గా వారు ఆ దీవిలోని గడపాల్సి వచ్చింది. లాక్ డౌన్ పూర్తి అయ్యి వారు బయటకు వచ్చాక విడాకులు తీసుకున్నారని చెప్పారు. ఇందుకు కల కారణాన్ని వివరిస్తూ.. ఈ కరోనా లాక్ డౌన్ మన జీవితాల్లోకి ఏది తీసుకురాకూడదో అదే తీసుకొచ్చిందన్నారు. అయితే ఎప్పుడు లేని విధం గా భార్య భర్తలు రాత్రి, పగలు తేడా లేకుండా ఒకే చోట ఉండాల్సి రావడంతోనే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయన్నారు.

puri 2

ఒకరిపై ఒకరికి అంచనాలు పెరగడం వలన అవి రీచ్ అవ్వకపోవడం వలన ఇలాంటి ఇబ్బందులు తలెత్తి అవి విడాకుల వరకు వెళ్తున్నాయన్నారు. అపరిమితమైన స్వేచ్ఛ కూడా ఇలా విడాకులకు దారి తీస్తుందని అన్నారు. అసలు పెళ్లి చేసేముందు అబ్బాయికి, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం చాలా ముఖ్యమని అన్నారు. కనీసం రెండేళ్ల పాటు అయినా.. ఒకరిపట్ల ఒకరికి పూర్తి గా అవగాహన ఏర్పడ్డాకే పెళ్లి చేయాలనీ అన్నారు. కరోనా మహమ్మారి కారణం గా యునైటెడ్ కింగ్డమ్ లో ఎప్పుడు లేని విధం గా డివోర్స్ రేటు 122 శాతం పెరిగిందన్నారు.

puri 3

అమెరికా, చైనా లో పరిస్థితి చెప్పక్కర్లేదని అన్నారు. మరో వైపు భారత్ లో అంతటి పరిస్థితి లేకున్నా.. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది డివోర్స్ రేటు పెరిగిందన్నారు. విడాకులకు ఉన్నట్లు.. పెళ్ళికి కూడా సరైన లీగల్ ప్రాసెస్ ఉండాలని పూరి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి భార్యా భర్తలు ఒకరితో కలిసి ఒకరు అరగంట కంటే ఎక్కువ మాట్లాడుకోలేరని.. అందుకే మిగతా సమయాన్ని టివి చూస్తూనో.. వాట్సాప్ చూసుకుంటూనో గడపడం నయమన్నారు. అలాంటప్పుడు.. ఈ లాక్ డౌన్ రోజుల్లో వివాహబంధాన్ని జాగ్రత్తగా ఉంచుకోవచ్చన్నారు.


End of Article

You may also like