తెలుగు సినిమా స్థాయి ‘బాహుబలి’ చిత్రంతో ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత అందరి దృష్టి తెలుగు సినిమాలపైనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చిన పుష్ప చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. సుకుమార్ దర్శకత్వం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు ఏడాది పూర్తికావస్తున్నా కూడా పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన ఇంకా మొదలు కాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Video Advertisement

 

ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మొదటి దాన్ని ‘పుష్ప: ది రైజ్’ పేరుతో విడుదల అవగా, రెండో భాగానికి ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో పుష్ప రూలర్ గా ఎలా మారాడు అన్న విషయాన్ని చూపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రానున్న ఈ రెండో భాగం లో ఎంతో మంది స్టార్లను భాగం చేయనున్నట్లు తెలుస్తోంది.

ram charan likely to be a part of pushpa 2..

ఈ నేపథ్యం లో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. పుష్ప 2 లో రామ్ చరణ్ ని ఒక కీలక పాత్ర కోసం ఒప్పించినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం సుకుమార్ అదిరిపోయే ట్విస్ట్ లు, యాక్షన్ సీక్వెన్స్ లు రాసుకున్నాడట. ఇందులో భాగం గా ఊహించని విధంగా రామ్ చరణ్ ఎంట్రీ ఉండేలాగా రాసుకున్నారట.

ram charan likely to be a part of pushpa 2..

ఈ మూవీ లో ప్రీ క్లైమాక్స్ సమయం లో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి, అల్లు అర్జున్ తో కలిసి ప్రత్యర్థులపై పోరాటం చేస్తారని టాక్. తమిళం లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ తనకంటూ ఒక యూనివర్స్ క్రియేట్ చెయ్యడం కోసం వరుసగా సినిమాలు చేస్తూ.. హీరోలని, కొన్ని పాత్రలని అందులో భాగం చేస్తున్నాడు. ఇప్పుడు అదే ఫార్ములాని సుకుమార్ క్రియేట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

pushpa 2 story leaked

అందుకే చిట్టిబాబు పాత్రని పుష్ప రాజ్ తో కలపబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమాలో నుండి ఒక డైలాగ్ కూడా లీక్ అయింది. అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్థం. అనే ఒక డైలాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది