సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్‌ చేసింది ఈ సినిమా. ఇక రెండో పార్ట్ ‘పుష్ప2’ను ప్రపంచవ్యాప్తంగా భారీ లెవల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్..

Video Advertisement

 

 

వరల్డ్ వైడ్ గా ఒకేసారి పుష్ప2 ను ఆడియెన్స్ ముందుకు తేవాలనే ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారు. ఇరవైకి పైగా దేశాల్లో ఈ మూవీని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది మైత్రీ టీమ్‌ అండ్‌ సుకుమార్‌ టీమ్‌. దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటన చేస్తారట.

is there pushpa part 3..??

అయితే ప్రస్తుతం పుష్ప 2 కి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి అన్ని హక్కులు కలుపుకుని 1050 కోట్ల రూపాయలు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులనే మొత్తం 750 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు టాక్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ ని మించి తమ సినిమాకు వ్యాపారం జరగాలని టార్గెట్ గా పెట్టుకున్నారట.

how many awards did RRR won..

పుష్ప ది రైజ్ ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పుడు పుష్ప 2 మాత్రం భారీ టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ తో బాహుబలి రికార్డ్స్ కొన్ని చోట్ల బీట్ చేసాడు. ఇక తర్వాత పార్ట్ తో ఆర్ఆర్ఆర్ ని బీట్ చెయ్యాలని చూస్తున్నారట. దక్షిణాదిలో 250 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 100 కోట్ల రూపాయలు, హిందీ 400 కోట్ల రూపాయలు, డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులు 300 కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేసినట్లు చెపుతున్నారు.