Ads
చాలామంది హిందువులు ముఖ్యమైన రోజుల నాడు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు పండుగ పర్వదినాలప్పుడు భగవంతుని పూజించే మిగిలిన పనులు చేసుకుంటారు. ధూపం దీపం నైవేద్యం ఇలా పూజా విధానంతో భగవంతుడికి పూజలు చేసి అంతా బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు. అలానే చాలామంది పుష్య పూర్ణిమ రోజు కూడా భగవంతుడిని ఆరాధించి పలు పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు.
Video Advertisement
ఇక మరి మనం పుష్య పౌర్ణమి ఎప్పుడు వచ్చింది..?, ఆ రోజు ఎటువంటి పనులను చేయాలి..?, ఎలాంటివి ఆచరిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
తెలుగు పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే పుష్య పూర్ణిమ ఈ నెల ఆరవ తేదీ, శుక్రవారం నాడు వచ్చింది. చంద్రునితో పాటుగా లక్ష్మీనారాయణను ఈ రోజున పూజిస్తే మంచిది. చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు ఇలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు కలగవని నమ్ముతారు. శాకంబరి పూర్ణిమ అని కూడా ఈ పుష్య పూర్ణిమను పిలుస్తారు.
శాకంబరి పూర్ణిమ లేదా పుష్య పూర్ణిమ నాడు వీటిని మరచిపోవద్దు:
#1. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి గంగానదిలో స్నానం చెయ్యాలి. అప్పుడు సకల పాపాలు పోతాయి. నదిలో స్నానం చేయడం కుదరకపోతే గంగా జలం వేసి స్నానం చెయ్యాలి.
#2. పూజకి పసుపు రంగు పువ్వులను తీసుకువచ్చి పెడితే మంచిది.
#3. తియ్యటి పదార్థాలని నైవేద్యంగా పెట్టడం, పంచామృతాలతో లక్ష్మీనారాయణను పూజించడం మంచిది.
#4. ఈరోజు పాలల్లో పంచదార వండిన అన్నం కలిపి చంద్రుడికి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టాక లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది.
#5. ఈరోజున శంఖంలో గంగాజలం, కుంకుమ వేసి విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే చాలా మంచి కలుగుతుంది.
#6. మంచి జరగాలన్నా విజయం సాధించాలన్నా ఈరోజు చీమలకు పిండిలో పంచదార వేసి పెట్టడం మంచిది.
#7. లక్ష్మీ దేవికి ఎర్రటి పూలతో లేదంటే గులాబీ పూలతో పూజ చేస్తే మానసిక ఒత్తిడి తొలగిపోతుంది.
End of Article