బాబోయ్ వీళ్ళ ఐడియా మాములుగా లేదుగా..? పెళ్లి కార్డులో QR కోడ్…స్కాన్ చేస్తే ఏమొస్తుందంటే.?

బాబోయ్ వీళ్ళ ఐడియా మాములుగా లేదుగా..? పెళ్లి కార్డులో QR కోడ్…స్కాన్ చేస్తే ఏమొస్తుందంటే.?

by Anudeep

Ads

కరోనా కారణం గా చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత పెళ్లిళ్లు చేయించుకున్న వారు కూడా చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షం లోనే ఈ వేడుకను జరిపించేసుకున్నారు. ఒకప్పుడు అంగరంగ వైభవం గా కనిపించే పెళ్లిళ్లు.. ఇప్పుడు నామమాత్రపు సందడి తో కనిపిస్తున్నాయి. అంతా కరోనా మహిమ. పెళ్లి కి వచ్చే వారు తగ్గిపోతుంటే.. పెళ్ళికి చదివించే చదివింపులు కూడా తగ్గిపోతున్నాయి. దీనితో తమిళనాడు మధురై కి చెందిన ఓ కుటుంబం ఓ ఐడియా వేసింది.

Video Advertisement

ఏకం గా పెళ్లి శుభలేఖ పైనే ఫోన్ పే/ గూగుల్ పే ల క్యూ ఆర్ కోడ్ లను ముద్రించారు. కరోనా కారణం గా ఎక్కువ మంది అతిధులను పిలవలేకపోవడం, పిలిచినా ఎక్కువ మంది రాకపోవడం జరుగుతోంది. దీనితో, వధూవరులకు వచ్చే చదివింపులు కూడా తగ్గిపోతున్నాయి. తమ కుమార్తె పెళ్లి వేడుకకు రాలేకపోయింది కానుకలను మాత్రం మిస్ చేసుకోకూడదను అనుకున్నారు. అందుకే శుభలేఖ ను డిజిటల్ కార్డు గా మార్చేశారు. శుభలేఖ పైనే క్యూ ఆర్ కోడ్ ను ముద్రించేసారు.

ఈ కార్డు అందుకున్న వారు పెళ్లి కి రాలేకపోయినా, ఫోన్ పే/ గూగుల్ పే ద్వారా చదివించవచ్చు. ఈ శుభలేఖ కోడ్ పై స్కాన్ చేసి ఇప్పటి వరకు ముప్పై మంది చదివింపులు చెల్లించారట. ప్రస్తుతం ఈ శుభలేఖ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనితో, చాలా మంది తమకు ఫోన్ చేసి ఐడియా బాగుందంటూ అభినందిస్తున్నారని పెళ్లి కుమార్తె తల్లి చెప్పుకొచ్చింది. అందుకే అంటుంటారు.. శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అని. మనం సరిగ్గా ఆలోచించాలే కానీ ప్రతిదానికి ఎదో ఒక పరిష్కారం ఉండనే ఉంటుంది. ఈ ఐడియా కూడా బాగానే ఉంది కదా. ఇక పై శుభలేఖల్లో కూడా ఇలా క్యూ ఆర్ కోడ్ లు తిష్ట వేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు.


End of Article

You may also like