రాణి “క్లియోపాత్ర” అంత అందంగా ఎలా ఉండేది..? ఆమె సౌందర్యం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?

రాణి “క్లియోపాత్ర” అంత అందంగా ఎలా ఉండేది..? ఆమె సౌందర్యం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా..?

by Megha Varna

హిస్టరీని మనం చూసుకుంటే అత్యంత అందమైన మహిళ ఎవరో మీకు తెలుసా..? ఆమె ఎవరో కాదండీ ఆమె క్లియోపాత్ర, చరిత్రలో గొప్ప అందగత్తె ఈమె. ఈమె ఈజిప్ట్ కి చెందిన వారు.

Video Advertisement

ఈమె ముక్కు కొంచెం పొడవుగా ఉంటుంది. పైగా ఈమె చూడడానికి చాలా అందంగా ఉంటారు. అందువల్లే ఆమెని ఎంతో మంది రాజులు కూడా కోరుకోవడం జరిగింది.

క్రీస్తు పూర్వం 48 వ సంవత్సరంలో ఈజిప్టును పరిపాలన మహి మహారాణిగా క్లియోపాత్రకు పేరుంది. పైగా ఇంత అందమైన మహిళ వెనుక ఒక సౌందర్య రహస్యం దాగి వుంది. ఇక దాని కోసం చూస్తే.. ఆమె వాడే సౌందర్య ఉత్పత్తుల గురించి వస్త్రధారణ గురించి ఎన్నో విషయాలు చర్చించడం జరిగింది. ఆమె వయసు పెరిగే కొద్దీ ఆమె అందం కూడా పెరుగుతూనే ఉందట.

ఆమె అందం అలా పెరగడానికి గల కారణం ఒక మసాలా నూనె. అదే కలోంజి. కలోంజీ ఎప్పటి నుంచో ఉంది. శతాబ్దాలుగా దీనిని ఆసియా, ఉత్తర ఆఫ్రికా మరియు అరబ్ దేశాలలో వాడుతూ వున్నారు. ఆయుర్వేదంలో కూడా దీనిని వాడుతూ ఉంటారు. మూడు వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టు పాలకులు దిష్టిబొమ్మలు లేదా మమ్మీలతో ఉంచవలసిన మరణాంతరం ముఖ్యమైన పదార్థం లో ఇది చేర్చబడింది.

కలోంజీ వలన ఎన్నో అద్భుతమైన లాభాలని మనం పొందొచ్చు. జలుబు, తలనొప్పి, ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు వంటి వాటి నుంచి ఇది బయట పడేస్తుంది. అలానే కలోంజిని లోషన్స్, క్రీమ్స్ వంటి వాటిని తయారుచేయడం కోసం కూడా వాడతారు. బ్యూటీ ఆయిల్స్ కోసం కూడా వాడుతుంటారు. అంతే కాకుండా ఇది అలసటని, బలహీనతని కూడా తొలగిస్తుంది. అలానే శ్వాసకోశ వ్యవస్థని కూడా మెరుగుపరుస్తుంది.


You may also like