ధూమపానం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ వ్యసనం శారీరక ఆరోగ్యాన్ని మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ధూమపానం చేయడం మంచిది కాదని.. మానేయమని చాలా మంది సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్లు చెప్పినంత సులభం కాదు స్మోకింగ్ మానేయడం. ఒకసారి ఎవరైనా దానికి అలవాటు పడ్డాక దాని నుండి దూరంగా రావడం చాలా కష్టం అవుతుంది. అందుకనే మానేసే వారు చాలా తక్కువగా ఉంటారు.

Video Advertisement

సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు తో పాటుగా మరి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే స్మోకింగ్ మానేసిన వాళ్లలో చాలా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా స్మోకింగ్ మానేసిన తర్వాత బాగా బరువు పెరిగిపోతారు. అయితే ఎందుకు నిజంగా స్మోకింగ్ మానేశాక బరువు పెరిగిపోతారు…? అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.

మామూలుగా సిగరెట్ కి అలవాటు పడిన వాళ్ళు ఒకసారి మానేస్తే అప్పుడు వాళ్ళ యొక్క మెదడు దానికి అంగీకరించదు. నిజంగా బరువు పెరిగిపోవడానికి ప్రధాన కారణం మెదడే. ఒకసారి నికోటిన్ మానేస్తే దాని వల్ల మెదడు అనేక అనారోగ్యకరమైన ఆహారాన్ని తినాలనే కోరికను పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. పైగా సిగరెట్లలో వుండే నికోటిన్ ఎక్కువ తిననివ్వదు. ఒకసారి మానేస్తే ఆటోమేటిక్ గా ఆకలి పెరిగిపోతుంది.  దీంతో మామూలుగా కంటే ఎక్కువ తింటారు.

ఈ కారణాల వలన స్మోకింగ్ మానేసిన తర్వాత చాలా మంది బరువు పెరిగిపోతారు. అదే విధంగా సిగరెట్ మానేసిన తర్వాత జీవక్రియ మందగిస్తుంది. దీనితో తక్కువ కేలరీలని మాత్రమే కరిగించగలరు. ఒకవేళ మీరు సిగరెట్లు మానేసి బరువు పెరిగి పోకుండా ఉండాలనుకుంటే ప్రతిరోజు వ్యాయామం పద్ధతుల్ని పాటించండి. రోజులో మీరు కాస్త సమయాన్ని వ్యాయామానికి కేటాయిస్తే తప్పకుండా బరువు తగ్గడానికి అవుతుంది. అలానే ఎక్కువ ఫైబర్ ని ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా బరువును మెయింటైన్ చేసుకోవచ్చు. అదే విధంగా మంచి నిద్ర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సరిగ్గా వేళకు నిద్ర పోవడం వల్ల అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తినాలనే కోరిక తగ్గుతుంది.