Ads
యుగాలు మారినా ప్రేమ మాత్రం మారదు. భూమి మీద మనుషులు ఉన్నంత వరకు కూడా ప్రేమ నిలబడుతుంది. ప్రేమ గురించి మాట్లాడితే రాధ అందరికీ గుర్తు వస్తుంది. కానీ చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది అంత ప్రేమ ఉన్న రాధ కృష్ణుడితో చివరి దాకా ఎందుకు ఉండలేదు అని.
Video Advertisement
కృష్ణుడితో బృందావనంలో ఉన్న రాధ తర్వాత ఎందుకు కృష్ణుడితో లేదు..?, ఆ తర్వాత ఆమె ఏమైంది అన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వీటి కోసం ఈరోజు మనం తెలుసుకుందాం.
బృందావనంలో ఎప్పుడూ కృష్ణుడుతో పాటు గోపికలు ఉంటారు. కానీ అక్కడ రాధ మాత్రం లేదు. బృందావనంలో రాధ ఉండేది కాదు. దానికి సమీపంలో ఉన్న రేపల్లెలో ఆమె ఉండేది. కృష్ణుడు కంటే కూడా రాధ 10 ఏళ్ళు పెద్ద అయినప్పటికీ వయస్సు వాళ్ల ప్రేమని ఆపలేదు. కంసుడు కృష్ణుడిని మధురకి తీసుకురమ్మని ఆక్రుడుని బృందావనంకి పంపుతాడు. కానీ గోపికలందరూ ఏడుస్తూ వెళ్ళవద్దని అంటారు.
కానీ వాళ్ల నుంచి ఎలాగో తప్పించుకుని కృష్ణుడు రేపల్లె వెళ్తాడు. అక్కడ ఐదు నిమిషాలు ఉంటాడు. అప్పుడు రాధ, కృష్ణుడు ఇద్దరూ మౌనంగానే ఉంటారు. వాళ్ళ మధ్య మాటలు కూడా ఉండవు. పైగా అతను ఎందుకు వెళ్ళాలో కూడా ఆమెకి తెలుసు. ఆఖరికి కృష్ణుడు బలరాముడు వెంట వెళతాడు. కంసుడిని సంహరిస్తాడు.. కొంతకాలం తర్వాత శిశుపాలుడుని కూడా చంపుతాడు అలానే ఇతర రాక్షసుల్ని కూడా కృష్ణుడు సంహరిస్తాడు.
మధురని చక్కదిద్ది కొంత కాలం తర్వాత ద్వారకకి కృష్ణుడు వెళతాడు. కానీ రాధ మాత్రం కృష్ణుడి వెంట ఉండదు. ఎక్కడుంది తాను అనేది చూస్తే.. ఆమె దూరంగా కృష్ణుడుని స్మరించుకుంటూ ఉంటుంది. అది చూసి తన తల్లి భయపడి రాధని మరొకరికి ఇచ్చి వివాహం చేస్తుంది. ఆ తర్వాత రాధ తన తల్లి కోరిక మేరకు వివాహం చేసుకోవడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వాళ్ళు పెద్దవాళ్ళు అవడం, వాళ్ళ వివాహం అవడం కూడా జరుగుతుంది. రాధ వయసు కూడా పైబడింది.
కృష్ణుడు వద్ద చనిపోయేలోగా ఉండాలని అనుకుంటుంది. దీంతో కృష్ణుడు కోసం కాలినడకన ద్వారకకు వెళుతుంది. రాజభవనంలో ఆమె చేరుతుంది. కృష్ణుడికి తప్ప ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. భౌతికంగా ఎంత దగ్గర ఉన్న ప్రయోజనం లేదని మనసే ముఖ్యమని ఆమె ఎవరికీ చెప్పకుండా రాజభవనాన్ని విడిచి వెళ్ళిపోతుంది.
End of Article