‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్​డమ్ ను సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల యశోద సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సామ్ మరో లేడీ ఒరియెంటెడ్ మూవీ శాకుంతలం చేస్తోంది. మయోసిటిస్ వ్యాధి తో బాధపడుతున్న సమంత.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది.

Video Advertisement

 

 

అయితే క్రిస్మస్ సందర్భంగా సామ్ కు హీరో అండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రను మంచి ఎనర్జీ ఇచ్చే గిఫ్ట్ పంపాడు. దానికి స్పందిస్తూ సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది. ఒక శక్తివంతమైన మెసెజ్ తో ఎనర్జీ నింపుతూ ఫొటోను బహుమతిగా అందించాడు. ఈ ఫొటోలో సమంత ఉక్కు మహిళగా (వుమెన్ ఆఫ్ స్టీల్) అభివర్ణించాడు రాహుల్.

rahul ravindran gift to samantha..!!

“ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు. కానీ త్వరలోనే అది వెలుగుతో ప్రకాశిస్తుంది. ఇప్పుడు నువ్ కదలడం కష్టంగా ఉండొచ్చు. కానీ త్వరలోనే అన్ని బాగుంటాయి. ఎందుకంటే నువ్ ఉక్కు మహిళవి. విజయం నీ జన్మ హక్కు. నువ్వు ఒక యోధురాలివి. నిన్ను ఏది ఓడించలేదు. ఇలాంటివి నిన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తాయి. ఎప్పటికీ స్ట్రాంగ్ ఉండేలా చేస్తాయి” అని రాసి ఉన్న ఫొటోను సమంతకు గిఫ్ట్ గా రాహుల్ ఇచ్చాడు.

rahul ravindran gift to samantha..!!

ఈ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సమంత. “థ్యాంక్యూ రాహుల్. బయట ఎవరైతో తమ జీవితాలతో పోరాడుతున్నారో వారందరి కోసం చెబుతున్నా. పోరాడుతూనే ఉండండి. ఇంకా మీరు బలంగా తయారవుతూ ఉంటారు. ఇంక దృఢంగా మారి కష్టాలను ఎదురిస్తారు” అని ఎమోషనల్ గా రాసుకొచ్చింది బ్యూటిఫుల్ సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

rahul ravindran gift to samantha..!!

సమంత ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని సమంత వ్యక్తిగత సిబ్బంది ఖండిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సామ్.. కొత్త సినిమాలు ఒప్పుకోవట్లేదు. గుణశేఖర్ దర్శకత్వం లో చేస్తున్న ‘శాకుంతలం’ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. విజయ్ దేవరకొండ తో చేస్తున్న ‘ఖుషి’ చిత్రాన్ని పూర్తి చేసి సామ్ విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.