సిరివెన్నెలకు తన మరణం గురించి ముందే తెలుసా…? చివరగా శ్యామ్ సింగరాయ్ కు ఆ పాట రాసేటపుడు ఏమి జరిగిందంటే..?

సిరివెన్నెలకు తన మరణం గురించి ముందే తెలుసా…? చివరగా శ్యామ్ సింగరాయ్ కు ఆ పాట రాసేటపుడు ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

ఎన్నో కావ్యాత్మక పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల గారి కలం ఇక ఆగిపోయింది అంటే నమ్మలేము. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన అక్షరం మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దూరం అయ్యారని.. ఆ అక్షరమే కన్నీరు కారుస్తోంది. సాహితీ ప్రపంచానికి మరో సిరివెన్నెల దొరకడం ఇక సాధ్యమేనా..?

Video Advertisement

సినీ సాహిత్య ప్రపంచానికి ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరు. సినీ ఇండస్ట్రీలో ఆయనకు అందరు సన్నిహితులే.. అందరితోనూ స్నేహంగా మెలిగేవారు.

సిరివెన్నెల మరణాన్ని ముందే ఊహించారు అని ఆయన దర్శకుడు రాహుల్ తో జరిపిన సంభాషణని బట్టి చూస్తే తెలుస్తుంది. నాని హీరోగా దర్శకుడు రాహుల్ శ్యామ్ సింగరాయ్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాసారు.

sirivennela

ఇందులో ఓ పాటకి ఆయన “సిరివెన్నెల” అనే పదంతో పాటని రాసారు. మొదట ఈ పాటని సిరివెన్నెల రాయలేదు. దర్శకుడు రాహుల్ కు ఫోన్ చేసి ఆరోగ్యం సహకరించడం లేదు అని చెప్పారట. దానితో రాహుల్ “పోనీలెండి సార్.. ఎవరితో అయినా రాయిద్దాం..” అని అన్నారట. ఆ మరుసటి రోజే రాహుల్ కు సిరివెన్నెల గారు ఫోన్ చేసి పల్లవిని చెప్పారట.

sirivennela new

ఆ పల్లవిలో సిరివెన్నెల అని ఉండేసరికి.. ఎందుకు సార్ పాటకి మీ సంతకం ఇచ్చారు..? అని రాహుల్ అడిగారు. బహుశా ఇదే నా చివరి పాట కావచ్చు అని సిరివెన్నెల బదులిచ్చి నవ్వేశారట. ఆ నిమిషం రాహుల్ అనుకోలేదు.. అదే నిజమవుతుందని. హీరో నాని కూడా ఈ పాటలని సిరివెన్నెలకే అంకితమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాటకి కూడా సిరివెన్నెల అనే పేరునే పెట్టారు.ఈ పాట కు సంబంధించిన వీడియో రేపు విడుదల కాబోతోంది.

Watch Video:


End of Article

You may also like