Ads
వర్షం అంటే అందరికి ఇష్టమే. ఇది సినిమాలో మాట అనుకుంట. రియల్ లైఫ్ కి వచ్చే సరికి వర్షం పడితే ఒకోసారి చిరాకు వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రైవ్ చేయాలంటే వర్షం లో ఆ రోడ్లపై ఓ మినీ యుద్ధమే చేయాల్సి వస్తుంది. వర్షం పడితేనే వెంటనే ఓ షెల్టర్ చూసుకొని దాని దగ్గరికి వెళ్తాము మనము. అంతేకాని సినిమాలో లాగా తడుస్తూ ఎంజాయ్ చేయము కదా? కాకపోతే నిన్న హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడు మాత్రం నాకో వింత సంఘటన ఎదురైంది.
Video Advertisement
ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి బస్సు స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. తెలిసిందేగా మన బస్సులు మనకి అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు తొందరగా రావు అని. ఈలోపు వర్షం మొదలైంది. ఒక్కసారిగా జోరుగా పడింది నిన్న వర్షం. రోడ్డుపై వెళ్లే వారందరు కూడా బస్సు స్టాప్ లో తడవకుండా ఉండడం కోసం ఆగారు. ఈ హడావిడిలో అందరు ఉండగా. ఈ వర్షం ఏంటి రా సడన్ గా అని అందరు తిట్టుకుంటూ ఉంటె ఓ అమ్మాయి మాత్రం వింత పని చేసింది. దెబ్బకి అక్కడున్నవారందరు నవ్వకుండా ఉండలేకపోయారు.
ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది అంటే. వర్షం పడుతూ ఉంటె…తన బ్యాగ్ లో నుండి ఓ బుక్ తీసి. అందులోనుండి ఓ పేపర్ చింపి. దానితో ఓ పడవ తయారు చేసింది. రోడ్డు మీద వర్షం నీరు పారుతూ ఉంటె. ఆ కాగితంతో చేసిన పడవను ఆ ప్రవాహంలోకి వదిలి. ఆ కాగితం పడవ ముందుకి కదులుతుంటే అది వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. ఎవరి సరదాలు వాళ్ళవి అనుకోండి.
End of Article