రాజారవీంద్ర అంత పరిచయం అక్కరలేని మంచి గుర్తింపు ఉన్న నటుడు. తన వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్స్ తో ఎన్నో సినిమాలు నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించాడు రాజారవీంద్ర.

Video Advertisement

ఇండస్ట్రీలో హీరో రవితేజకు మరియు రాజారవీంద్ర ఉన్న సాన్నిహిత్యం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఓ ఇంటర్వ్యూ సందర్భంలో రవితేజ తనని ఎంతో అభిమానంగా మామ అని పిలిచేవాడిని, రవితేజ వివాహ సమయంలో అతనే కాళ్లు కడిగి కన్యాదానం చేశానని తెలియజేశారు.

ఈ మధ్య కాలంలో రవితేజతో కొన్ని విభేదాలు రావడం వల్ల  ఆయనతో మాట్లాడటంలేదని రాజారవీంద్ర తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూనే ఎంతో మంది హీరోలకు మేనేజర్ గా  పని చేశాడు రాజారవీంద్ర. తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు రాజారవీంద్ర. ఈ సందర్భంగా ఎంతో మంది హీరోలు తన మేనేజర్లును తీసేస్తుంటారు. అదే విధంగా సునీల్ కూడా నన్ను తాజాగా తన మేనేజర్ గా తొలగించాడు. అసలు విషయం ఏమిటి అని రాజారవీంద్రని ప్రశ్నించగా, ఆ విషయం సునీల్ ని అడిగి తెలుసుకోమని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు సునీల్.

Sunil and rajaravindra

ఎవరితో అయిన తనకి గొడవ వస్తే పర్సనల్ గా కలిసి సమస్యను సరిదిద్దుకుంటే బెటర్ గా ఉంటుందని సలహా ఇచ్చేవాణ్ణి. కొన్ని విషయాలలో అతనితో నేనే మాట్లాడతాను అంటు మరిచిపోయేవాడిని. కొంతకాలంగా హీరో నుంచి కమెడియన్ గా నటిస్తున్నారు సునీల్. బహుశా పర్సనల్ అటెన్షన్ ఎక్కువగా ఉండాలని ఫీలయ్యారు అనుకుంటా, ఆ అటెన్షన్ నా దగ్గర లేకపోవడం వల్ల నన్ను మేనేజర్ గా తీసేసివుంటారు అని భావిస్తున్నాను. కానీ ఇప్పటికీ సునీల్ ఆ విషయంపై సరైన సమాధానం ఇవ్వలేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వెల్లడించారు.