టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి చిత్రం తో తెలుగు చలనచిత్ర గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశాడు. మొన్నటి వరకు కొన్ని దేశాల్లో మాత్రమే వినిపించిన ఆయన పేరు.. ఆస్కార్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఆయన ఆస్కార్ గెలవడం తో ఆయనకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

Video Advertisement

 

 

దర్శకుడిగా రాజమౌళి 20 ఏళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆయన అన్నీ కమర్షియల్ సినిమాలే తీస్తుంటారు. కానీ ప్రజల నాడిని కరెక్టుగా పట్టుకుంటారు. అలాగే తన సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో జక్కన్నకు తెలిసినంతగా మరే ఫిలింమేకర్‌కి తెలియదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఇండియా తరపున జ్యూరీ టీమ్ ఆస్కార్స్‌కి పంపలేదు.. దీంతో ప్రమోషన్స్‌ని పర్సనల్‌గా తీసుకుని, ఖర్చుకి ఏమాత్రం వెనుకాడకుండా.. ఆస్కార్ అనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు జక్కన్న.

rajamouli rented ahouse in USA..??

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు లభించడంతో కీరవాణి లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత ఆదివారం రాత్రి జరిగిన వేడుక అనంతరం ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, వారాహి సాయి కొర్రపాటి సహా వారి మిత్రులు చాలా మంది పాల్గొన్నారు. అయితే ఆ పార్టీ జరిగిన ఇంటిని రాజమౌళి అద్దెకు తీసుకున్నారన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

rajamouli rented ahouse in USA..??

ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం కుటుంబంతో కలిసి అన్నేసి రోజులు హోటల్‌లో ఉండాలంటే కష్టం కాబట్టి లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇంటిని రెంట్‌కి తీసుకున్నారట రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సెలబ్రేషన్స్ కూడా ఆ ఇంట్లోనే గ్రాండ్‌గా జరుపుకున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా రాజమౌళి ఇప్పటికే హాలీవుడ్ రేంజ్లో ఫేమస్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే తాను చేయబోతున్న తర్వాతి సినిమాలను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.

how many awards did RRR won..

అలాగే రాజమౌళి తన అప్‌కమింగ్ మూవీ.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాను ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచరస్ ఫిల్మ్‌గా రూపొందించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన గత ఆరు నెలల్లో అమెరికాకు చాలాసార్లు వెళ్లాల్సి వచ్చింది. అయితే వెళ్లిన ప్రతిసారి స్టేయింగ్ కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి లాస్ ఏంజిల్స్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడని తెలుస్తోంది.