ఇద్దరు పిల్లలు పుట్టాక “రజనికాంత్” నిర్ణయం..! తర్వాత ఏమైందంటే..??

ఇద్దరు పిల్లలు పుట్టాక “రజనికాంత్” నిర్ణయం..! తర్వాత ఏమైందంటే..??

by Anudeep

Ads

సాధారణంగా అందరి జీవితంలోనూ పెళ్లి అనేది ఓ మెమరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మూమెంట్.. దంపతుల మధ్య సఖ్యత కుదరకపోతే పరస్పర అంగీకారంతో విడిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. అయితే రజినీకాంత్ స్టార్ గా వెలిగిపోతున్న రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఇలాగే తన భార్య లతకు విడాకులిద్దామనుకున్నారు. ఈనికి సంబంధించిన ఒక న్యూస్ క్లిప్పింగ్ వైరల్ గా మారింది.

Video Advertisement

రజినీకాంత్ లత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కలయిక పరిచయం ఆ తర్వాత పెళ్లి కూడా అచ్చంగా సినిమాలో జరిగినట్లుగానే జరిగింది.1980లో సినిమా షూటింగ్లో ఉన్నారు రజినీకాంత్.ఆ సమయంలో కాలేజీ మ్యాగజైన్ కోసం రజిని ఇంటర్వ్యూ కోసం వచ్చారు లత. ఇక ఇంటర్వ్యూ అయ్యాక వెంటనే లతా దగ్గరికి వెళ్లి పెళ్లి ప్రపోజల్ చేశారట.పెద్ద హీరో అయిన రజినీకాంత్ అలా పెళ్లి ప్రపోజల్ చేయడంతో మొదట షాక్ అయ్యారట లత. కానీ ఆ తర్వాత ఆనందపడి పేరెంట్స్ తో మాట్లాడాలి అని చెప్పారట.

why rajankanth thinking of giving divorce to his wife..

ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులతో లతా పేరెంట్స్ మాట్లాడించిన రజనీకాంత్.ఇక ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 1981 ఫిబ్రవరి 26వ తేదీన లత ను పెళ్లి చేసుకున్నారు.ఇక వీరి పెళ్ళి అయ్యి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది. వీరిద్దరి అన్యోన్య దాంపత్యం చాలా మందికి ఉదాహరణగా నిలుస్తుంది.

why rajankanth thinking of giving divorce to his wife..

అయితే కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఇలాగే తన భార్య లతకు విడాకులిద్దామనుకున్నారు. 1982 లో పెద్ద అమ్మాయి ఐశ్వర్య రజినీకాంత్, 1984లో రెండో అమ్మాయి సౌందర్య రజినీకాంత్ పుట్టారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు చోటు చేసుకున్నాయి. రజినీకి భక్తి ఎక్కువ. ఆ సమయంలో హరే కృష్ణ మూమెంట్ ముమ్మరంగా జరుగుతుంది. అందులో పాల్గొంటూ రజినీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు.

why rajankanth thinking of giving divorce to his wife..

అది లతా-రజినీ మధ్య గొడవలకు దారి తీసింది. అప్పట్లో పత్రికలు భార్యతో రజినీకి విబేధాలు, విడాకులు తీసుకొని విడిపోవాలి అనుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. రజినీకాంత్ ఈ విషయంపై స్పందించారు. అభిప్రాయబేధాల వలన నాకు లతతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. అందుకే విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నాము. అంతకు మించి మా మధ్య ఎలాంటి ద్వేషం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్-లత విడిపోవడం ఖాయమని కొందరు భావించారు. పత్రికల్లో ఇదే విషయం ప్రచురించారు. అయితే ఆయనకు రెండో వివాహం చేసుకునే ఆలోచన కూడా లేదని పత్రికల్లో రాశారు.

why rajankanth thinking of giving divorce to his wife..

కాగా రజినీకాంత్-లత తిరిగి కలిసిపోయారు. మనస్పర్థలు తొలగి పోయాయి. అక్కడ నుండి దశాబ్దాలుగా వారి దాంపత్య జీవితం సాగుతుంది.


End of Article

You may also like