ఇండియన్ మూవీ ట్రెండ్ సెట్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ మూవీ విడుదల అయింది అంటే చాలు కచ్చితంగా తమిళ్ చిత్ర సినిమాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలబడి తీరాల్సిందే.

Video Advertisement

అయితే ఈ తమిళ్ స్టార్ కి కేవలం తమిళనాట మాత్రమే కాదు ఇటు టాలీవుడ్ లో కూడా మంచి స్టార్ డమ్ ఉంది. తెలుగులో కూడా రజనీకాంత్ చిత్రాలు భారీ కలెక్షన్స్ వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

comments on this scenes in jailer

అయితే గత కొద్ది కాలంగా రజినీకాంత్ మూవీస్ లో మునుపుటి పట్టు తగ్గింది. ఏదో ఆవరేజ్ గా అంతంత మాత్రమే సాగుతున్న చిత్రాలు వరుసగా రావడంతో ఆయనపై రకరకాల విమర్శలు కూడా మొదలయ్యాయి. సరిగ్గా ఇదే టైంలో నెల్సన్ డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రజిని మూవీ చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. దీంతో రాబోయే చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

jailer movie review

నెల్సన్ విజయ్ కాంబినేషన్లో అంతకుముందే విడుదలైన బీస్ట్ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగలడంతో రజనీ నెల్సన్ కాంబోలో రాబోయే చిత్రంపై కూడా పలు రకాల అనుమానాలు నెలకొన్నాయి. అయితే రజనీ మాత్రం గట్టి నమ్మకంతో జైలర్ చిత్రం నెల్సన్ చేతుల్లో పెట్టాడు. ఆగస్టు 10న గ్రాండ్ గా సినిమా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఓ రేంజ్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

jailer movie review

ఇంతకుముందు బాక్సాఫీస్ ని చెడగొడాడిన చిత్రాల కలెక్షన్స్ ని కూడా దాట్టేసి కొత్త రికార్డులు సృష్టించింది జైలర్ మూవీ. చాలాకాలం తర్వాత ఒక భారీ షిట్ అందడంతో రజిని కూడా బాగా కుష్ అయ్యాడట. ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు జాయిలర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు కలెక్షన్ సాధించింది. లాస్ట్ ఇయర్ తమిళ్ లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసిన ‘పొన్నియన్ సెల్వన్’, ‘విక్రమ్’మూవీ కలెక్షన్స్ ని కూడా జైలర్ చిత్రం బీట్ చేసింది.

jailer movie review

భారీగా వసూలు రావడంతో సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ తనకు వచ్చిన లాభంలో కొంత భాగం రజనీకాంత్ కూడా ఇచ్చినట్లు తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. ఇంత సక్సెస్ తెచ్చిన రజనీకి 100 కోట్లు గిఫ్ట్ ఇచ్చిన కళానిధి ఆ చెక్ పై ‘ది రియల్ రికార్డ్ మేకర్’అని రాయడం రజని యొక్క గొప్పతనానికి ప్రతీక అని అతని అభిమానులు భావిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రానికి రెమ్యూనరేషన్ కింద రజనీకాంత్ 110 కోట్లు అందుకున్నారు. ఇప్పుడు వచ్చిన 100 కోట్లతో కలిపితే జైలర్ చిత్రానికి రజిని అందుకున్న పారితోషకం మొత్తం 210 కోట్లు అవుతుంది. ఇది నిజంగానే ఇండియన్ సినీ హిస్టరీలో ఒక పెద్ద రికార్డుగా నిలబడిపోతుంది.

ALSO READ : ప్రభాస్ ఆధార్ కార్డ్ చూసారా..? అందులో ప్రభాస్ ఎలా ఉన్నారు అంటే..?