Ads
పాండమిక్ కారణంగా ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరోగ్య విషయంలో అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి టైమ్ లో హెల్త్ కేర్ సెక్టార్ ముందుకు వచ్చి అందరికీ భరోసా ఇచ్చింది. వ్యాక్సిన్ ఇవ్వడంలో కానీ ప్రజలకి ట్రీట్మెంట్ చేయడంలో కానీ, ఇలా అన్నిటిలోనూ ముందుంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలు, మెడికల్ పరికరాలను తయారుచేసే మ్యానుఫ్యాక్చరర్ లు కూడా వైద్య సంస్థలకు ఎంతో సహకారం అందించారు.
Video Advertisement
వీరిలో ఒక సంస్థ మాత్రం గంటకి 3.75 లక్షల సిరంజెస్ ని అందించారు. ద బెటర్ ఇండియా కథనం ప్రకారం, కరోనా సమయంలో మెడికల్ పరికరాలను తయారు చేసి ఉత్పత్తి చేయడంలో ఎంతో సహకారాన్ని అందించిన వారు రాజీవ్ నాథ్. రాజీవ్ నాథ్ హిందుస్థాన్ సిరంజెస్ అండ్ మెడికల్ డివైసెస్ లిమిటెడ్ (HMD) యొక్క మేనేజింగ్ డైరెక్టర్. అంతే కాకుండా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ (AiMeD)కి ఫోరం కోఆర్డినేటర్ గా కూడా ఉన్నారు.
కరోనా కారణంగా ప్రజలందరూ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, అలాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీస్ యొక్క భవిష్యత్తు గురించి రాజీవ్ నాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.కరోనా కారణంగా పెరిగిన మార్కెట్ డిమాండ్ గురించి రాజీవ్ నాథ్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంది. మొదట డిమాండ్ తక్కువగా ఉంది.
తర్వాత వ్యాక్సినేషన్ కోసం సిరంజెస్ డిమాండ్ చాలా పెరిగింది. HMD భారతదేశంలో ఆటో డిస్పోజబుల్ సిరంజెస్ తయారు చేసే మొదటి కంపెనీ. గత కొద్ది నెలల నుండి జపాన్, బ్రెజిల్, యు.ఎస్ నుండి డిస్పోజబుల్ సిరంజెస్ కోసం, అలాగే ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక నుండి ఆటో డిస్పోజబుల్ సిరంజెస్ కోసం మాకు ఎన్నో ఆర్డర్స్ వచ్చాయి.
ఇలా డిమాండ్ పెరగడం అనేది ఖచ్చితంగా ఒక ఛాలెంజ్ లాంటిది. కానీ మేము దీన్ని ప్రపంచం మొత్తం కోవిడ్ పై చేస్తున్న యుద్ధంలో గెలవడానికి మా వంతు బాధ్యత లాగా తీసుకున్నాం. అంతే కాకుండా HMD తయారుచేసిన డిస్పోవాన్ అనే సిరంజ్ మార్కెట్ షేర్ దాదాపు 60 శాతం వరకు ఉంది. అలాగే డిస్పోవాన్ ఇన్సులిన్ సిరంజి మార్కెట్ షేర్ ప్రైవేట్ సెక్టార్ లో 70 శాతం వరకు ఉంది.
మేము కోజాక్ AD సిరంజిల ఉత్పత్తిని పెంచాము. ఇప్పటికే 140 మిలియన్ల ఆటో డిస్పోజబుల్ సిరంజిలను, కోజాక్ AD 0.5 ఎంఎల్ సిరంజిలను కోవాక్స్-డబ్ల్యూహెచ్‌ఓ (WHO) కి సరఫరా చేశాం. మార్చి 2021 వరకు HMD మొత్తం 177.6 మిలియన్ కోజాక్ AD 0.5ml సిరంజిలని ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది.
End of Article