Ads
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. తానేంటో నిరూపించుకొని గ్లోబల్ స్టార్ గా మారారు. వెండితెరపై తిరుగులేని అభిమానగణం మెగాస్టార్ చిరంజీవి సొంతం. అలాంటి బరువైన మెగా ట్యాగ్‌తో చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎదుగుతూ ప్రస్తుతం హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిన తీరు అందరికీ ప్రేరణ కలిగిస్తుంది.
Video Advertisement
అయితే రామ్ చరణ్ ఈ స్థాయికి అంత సులువుగా చేరుకోలేదు. కెరీర్ మొదట్లో చరణ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నిటిని తిప్పి కొడుతూ తానేంటో నిరూపించుకున్నాడు చరణ్. అయితే తాజాగా చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. చరణ్ ఇండస్ట్రీ లోకి రాక ముందు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో రామ్ చరణ్ తీసుకుంటున్న యాక్టింగ్ ట్రైనింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది.
ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీయ కూడా ట్రైనింగ్ తీసుకుంది. ఆమెతో రామ్ చరణ్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో తెగ వైరల్ గా మారింది..వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు హీరో హీరోయిన్ గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు..రీసెంట్ గా విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రం లో రామ్ చరణ్ కి తల్లిగా నటించింది శ్రీయ, అలా వీళ్లిద్దరు కలిసి నటించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదే కాకుండా రామ్ చరణ్ ప్రాక్టీస్ కి సంబంధించిన ఇతర క్లిప్పింగ్స్ కూడా ఆ వీడియో లో ఉన్నాయి.
ఇక చరణ్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్‌తో కలిసి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజెర్ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కాగా.. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.
watch video:
End of Article