మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ ఇటీవల అభిమానుల్ని మెప్పించినా.. బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేకపోయింది. అక్టోబరు 5న రిలీజైన ఈ మూవీ తొలి రోజు నుంచే హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఓవరాల్‌గా ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’ మూవీ చిరంజీవికి టాక్‌ పరంగా ఊరటనిచ్చింది.

Video Advertisement

 

వాస్తవానికి గాడ్‌ఫాదర్ సినిమా.. మలయాళం మూవీ ‘లూసిఫర్‌’కి రీమేక్. దాంతో గాడ్‌ఫాదర్ రిలీజ్‌కి ముందే లూసిఫర్‌ని చూసిన ప్రేక్షకులకి ఈ కథ ఏంటో తెలిసిపోయింది. దీంతో చిరు ఇమేజ్ తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకి తెచ్చారు దర్శకుడు మోహన్ రాజా. అయితే తాజాగా ఆ మూవీ గురించి రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ram charan shocking comments about chiru's god father movie..

అయితే లూసిఫర్ ఆధారంగా నిర్మించిన చిరు గాడ్ ఫాదర్ సినిమా ఓటీటిలో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుందని రామ్ చరణ్ తెలిపారు. కానీ మాతృక అయిన లూసిఫర్ సినిమా మాత్రం ఓటీటి లో ఇదివరకే విడుదలై బాగా ఆకట్టుకుంది. అందుకే చాలా వరకు ప్రేక్షకులు గాడ్ ఫాదర్ సినిమాని చూడడానికి ఇష్టపడలేదన్నారు. ఒక వేళ తాను రీమేక్ సినిమాలు చెయ్యాలి అనుకుంటే మాత్రం ఆ మూవీ ని ఓటీటీ లో విడుదల చెయ్యొద్దని నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తా అని ఆయన వెల్లడించారు.ఆ కండిషన్‌కు ఒప్పుకోకపోతే.. ఒరిజినల్ కథలతోనే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ram charan shocking comments about chiru's god father movie..

మరోవైపు థియేటర్లలో సందడి చేసిన గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం డిజిటిల్ రైట్స్ సొంతం చేసుకున్న దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు గాడ్ ఫాదర్ మూవీని నవంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం రూ.145 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందని రామ్ చరణ్ తెలిపారు.