“రామ్ చరణ్-ఉపాసన” కూతురి పేరుకి అర్థం ఏంటో తెలుసా..?

“రామ్ చరణ్-ఉపాసన” కూతురి పేరుకి అర్థం ఏంటో తెలుసా..?

by kavitha

Ads

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన జంట జూన్ 20న తల్లిదండ్రులగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. మంగళవారం రోజున ఉపాసన ఆడపిల్లకు జన్మనివ్వడంతో లక్ష్మీదేవి పుట్టిందని మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

Video Advertisement

దాదాపు పదకొండు ఏళ్ల తర్వాత చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కావడంతో చిరంజీవి, సురేఖ చాలా  సంతోషపడ్డారు. తమ పాపకి ఇప్పటికే పేరును కూడా నిర్ణయించామని చేసినట్లు మొన్న అపోలో హాస్పిటల్ వద్ద చరణ్ మీడియా ముందు చెప్పారు.

నేడు రామ్ చరణ్ కూతురు బారసాల వేడుకను నిర్వహిస్తున్నట్లుగా సామాజిక మధ్యమం ద్వారా ఉపాసన తెలిపింది.  దాంతో బారసాల వేడుక పై అందరికి ఆసక్తి ఏర్పడింది. అలాగే మెగావారసురాలికి ఏం పేరు పెట్టారో తెలుసుకోవాలనే  ఇంట్రెస్ట్ నెలకొంది.

వారసురాలి రాకతో మెగాస్టార్ ఫ్యామిలిలో సంబరాలు జరుపుకుంటున్నారు. నేడు (జూన్ 30) మెగాస్టార్ ఇంట్లో బారసాల వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. తన మనవరాలి పేరు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్వీట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన కుమార్తె పేరు ‘క్లింకారా’ అని పెట్టినట్లుగా వెల్లడించారు. ఉపాసన కూడా ఈ విషయన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

తమ కుమార్తెకు పెట్టిన పేరును లలిత సహస్రనామం నుండి తీసుకున్నారు. క్లింకారా అనేది లలితాసహస్రనామాల్లోని  బీజాక్షం. ప్రకృతికి మరియు శక్తికి ప్రతిరూపం అని అర్థం. ఆ పేరులో ఒక శక్తి మరియు పాజిటివ్ వైబ్రేషన్ ఉందని, మా లిటిల్ ప్రిన్సెస్ కు ఈ లక్షణాలను అందిపుచ్చుకుంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ పేరు వినడానికి కాస్త  కొత్తగా అనిపించినా, ఈ పేరులో మంచి అర్ధం ఉందని అంతా అనుకుంటున్నారు. ఇక క్లింకారా బారసాల వేడుకకు  సంబంధించిన ఫోటోలు కొన్ని ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read: “పవన్ కళ్యాణ్ పాత సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి..! అంటూ… పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ “బ్రో” టీజర్‌పై 15 మీమ్స్..!

 


End of Article

You may also like