Ads
మనలో చాలామందికి కలలు వస్తూ ఉంటాయి. వీటిలో మంచి కలలు ఉంటాయి.. పీడ కలలు ఉంటాయి. ఒక్కొక్కలకి ఒక్కో అర్థం ఉంటుంది. దానివల్ల భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అని సూచనగా కూడా భావిస్తూ ఉంటారు. తెల్లవారుజామున వచ్చే కలలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే అవి ఎక్కువ శాతం నిజం అవుతాయని నమ్ముతారు కూడా.
Video Advertisement
చాలామందికి ఆలయాలు దేవుళ్ళు కలలోకి వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం దేశమంతా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకుంటుంది.ఏ నోట విన్న ఎక్కడ విన్న శ్రీరాముని నామమే జపిస్తున్నారు. ఏ ఊరిలో చూసినా కోదండ రాముని కబుర్లే… ఒకపక్క అయోధ్య అక్షింతలు పంచుతూ.. మరోపక్క రామ నామ కీర్తన భజనలు చేస్తూ రాముని పూజలో మునిగిపోయి ఉన్నారు.
అయితే చాలామందికి అయోధ్య ఆలయం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి రామాలయం రాముడు కలలోకి వస్తూ ఉంటారు. నిన్న జరిగిన రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ఎక్కువమంది రాముడు గురించి ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి…ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది.
అయితే స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో రాముడు గాని రామాయంగానే కనిపిస్తే అది శుభ సూచకంగా చెప్పాలి. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా త్వరలో విజయం సాధించబోతున్నారనే దానికి ఇది సంకేతం. మీకు జీవితంలో ఏదైనా తీరని కోరిక ఉంటే అది త్వరలోనే తీరుతుంది. అలాగే కొత్త సంపద సృష్టి ఆర్థిక శ్రేయస్సు కూడా సూచిస్తాయి. కాబట్టి కలలో శ్రీరామచంద్రుడు నిస్సిందేహంగా ఆయనను జపించండి.
End of Article