రామమందిరానికి అంత విరాళం ఇచ్చినా… ఈ తెలుగు హీరోయిన్ కి అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం ఎందుకు అందలేదు?

రామమందిరానికి అంత విరాళం ఇచ్చినా… ఈ తెలుగు హీరోయిన్ కి అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం ఎందుకు అందలేదు?

by Mohana Priya

అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట ఎంత ఘనంగా జరిగిందో తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యి శ్రీరాముడి దర్శనం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Video Advertisement

ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. అయితే రామ మందిరానికి విరాళాలు ఇచ్చిన వారిలో మరొక తెలుగు హీరోయిన్ కూడా ఉన్నారు. కానీ ఆ తెలుగు హీరోయిన్ కి శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకి ఆహ్వానం కూడా అందలేదు. ఆ హీరోయిన్ మరెవరో కాదు. ప్రణీత సుభాష్. ప్రణీత సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటారు.

హిందూ ధర్మాన్ని కూడా ఎంతో బాగా పాటిస్తారు. హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం యొక్క విశిష్టత గురించి సోషల్ మీడియా ద్వారా తనకి చేతనైనంత చెప్తూ ఉంటారు. పండుగలప్పుడు, లేదా మరి ఏదైనా ఇతర పర్వదినాలప్పుడు గుడికి వెళ్లి, దేవుడిని దర్శించుకుని, అందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. ప్రతి పద్ధతిని తప్పకుండా పాటిస్తారు. అలాంటి ప్రణీత అయోధ్య రామ మందిరానికి విరాళం ఇచ్చారు.

ప్రణీత అయోధ్య రామ మందిరం కోసం లక్ష రూపాయలు ఇచ్చారు. రామ మందిరం ప్రాముఖ్యత గురించి ఎన్నో సార్లు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. అంతే కాకుండా, ప్రణీత రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారిలో మొదట్లోనే ఉన్నారు. అప్పటి నుండి, ఇప్పటి వరకు రామ మందిరానికి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆ న్యూస్ షేర్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అయితే, అలా చేసిన ప్రణీతని అసలు ఆహ్వానించకపోవడం అనేది చర్చలకి దారి తీసిన విషయం అయ్యింది. మరొక పక్క, ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ ని పిలిచారు. కత్రినా కైఫ్ కూడా వెళ్లారు. వాళ్లకి ప్రణీత ఏమాత్రం తీసి పోరు కదా? “అసలు సనాతన ధర్మం గురించి చెప్పడం, సనాతన ధర్మాన్ని పాటించడం వంటివి ప్రణీత ఇంకా బాగా చేస్తారు. అలాంటి ప్రణీతని ఆహ్వానించకపోవడం ఏంటి?” అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. మరి దీని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు.

ALSO READ : చాలా మంది తెలుగు హీరోయిన్స్ కంటే ఈ అమ్మాయి బాగా నటిస్తుంది ఏమో..! ఈమె ఎవరంటే..?


You may also like

Leave a Comment