‘దేవదాసు’ సినిమాతో హీరోగా పరిచమైన రామ్ పోతినేని.. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇప్పటి యంగ్ హీరోల్లో డాన్స్, ఫైట్స్, యాక్టింగ్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇస్మార్ట్ హీరోగా ఇరగదీస్తున్నాడు. అయితే రామ్ పోతినేని తాజాగా ఒక రికార్డు క్రియేట్ చేసాడు.

Video Advertisement

 

ప్రస్తుతం మన సౌత్ హీరోలు.. నార్త్‌ ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి’ సినిమాతో అది పీక్స్ వెళ్లిందనే చెప్పాలి. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ మూవీ ముందు వరకు తన హిందీ డబ్బింగ్ సినిమాలతో అక్కడ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ వరుసలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ పోతినేని,నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నారు.

ram pothineni movies creats history in hindi..

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆడకపోయినా యూట్యూబ్ లో మాత్రం దూసుకుపోతుంటాయి. అయితే తాజాగా హీరో రామ్ ది వారియర్ సినిమాతో కూడా అదే తరహాలో వంద మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా రామ్ పోతినేని ఒక రికార్డును క్రియేట్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలోనే వరుసగా ఏడు హిందీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకున్న హీరోగా అతను రికార్డు క్రియేట్ చేశారు.

ram pothineni movies creats history in hindi..

రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రామ్ నటించిన కొన్ని సినిమాలకు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. అందులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉండడం విశేషం. ముఖ్యంగా మొదటిసారి గణేష్ సినిమా తోనే రామ్ హిందీ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాడు. తర్వాత ఒకటే జిందగీ, హలో గుర్తు ప్రేమ కోసమే, నేను శైలజా, హైపర్, ఇస్మార్ట్ శంకర్, ఇప్పుడు వారియర్ చిత్రాలు 100 మిలియన్ మార్క్ ని అందుకున్నాయి. మరే సౌత్ హీరోకి ఈ రేంజ్ లో రెస్పాన్స్ హిందీలో లేదనే చెప్పాలి. మరి రామ్ సినిమాలు కూడా హిందీ లో విడుదల చేస్తే మంచి లాభాలే వచ్చేలా ఉన్నాయి.