”రామబాణం” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

”రామబాణం” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by kavitha

Ads

మ్యాచో మ్యాన్ గోపీచంద్, విలక్షణ నటుడు జగపతిబాబు లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం రామబాణం. ఈ మూవీలో  హీరోయిన్ గా డింపుల్ హయాతి నటించింది. డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కించిన ఈ మూవీ మే 5న థియేటర్లలో విడుదల కానుంది.

Video Advertisement

ఈ చిత్రాన్ని సుమారు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీవాస్ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. మరి సెన్సార్ బోర్డు ఈ మూవీపై  ఎలాంటి రివ్యూ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..
గోపీచంద్ , శ్రీవాస్ కలయికలో వస్తున్న 3వ చిత్రం ఇది. దీంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మే 5న  విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో మొదలుపెట్టింది. ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదల అయిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేశారు. డైరెక్టర్ శ్రీవాస్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే సెన్సార్ సభ్యులు తమ చిత్రాన్ని ప్రశంసించారని కూడా తెలిపారు.
ఈ చిత్రంలో ఎలాంటి  కట్స్ కానీ మ్యూట్ కానీ చేయకుండా సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. ఈ మూవీని చూసిన తరువాత సెన్సార్ సభ్యులు తనని, కో ప్రొడ్యూసర్ వివేక్ ని పిలిచి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారని, కట్ చేసే అడియొకని, వీడియో కానీ లేవని చెప్పి అభినందించారని పేర్కొన్నారు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్ల యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిపారని రాసుకొచ్చారు. అలాగే సెన్సార్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు.
మే 5న మా సినిమా విడుదల అయినప్పుడు ప్రేక్షకులు ఈ విధంగా  అనుభూతి చెంది మా ‘రామబాణం’ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి కుష్బూ కీలక రోల్ లో నటిస్తున్నారు.  ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ డైరెక్టర్ తేజతో నిర్వహించిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో నెట్టింట్లో  వైరల్ గా మారింది. ఈ మూవీ సాధించే వసూళ్ల ఆధారంగా గోపీచంద్ నెక్స్ట్ చేసే చిత్రాల బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Also Read: “కుష్బూ” నుండి… “సమంత” వరకు… అభిమానులు “గుడి” కట్టిన 10 హీరోయిన్స్..!


End of Article

You may also like