ముస్లింల పవిత్ర నెల రంజాన్ మాసంలో ఉపవాసం ఎందుకు ఉంటారు? ఎప్పుడు ప్రారంభమైంది?

ముస్లింల పవిత్ర నెల రంజాన్ మాసంలో ఉపవాసం ఎందుకు ఉంటారు? ఎప్పుడు ప్రారంభమైంది?

by kavitha

Ads

రంజాన్ మాసం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరికి అత్యంత పవిత్రమైంది. రంజాన్ మాసం మొదలవడంతో ముస్లింలు అందరు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నారు.

Video Advertisement

ఈ నెలలో అల్లా భక్తులకు అతి సమీపానికి వస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల ఈ నెల ముస్లింలకు ప్రాధాన్యత కలిగిన మాసం. ఈ నెల మొత్తం అల్లా ప్రార్ధనలు చేస్తూ గడుపుతారు. ఈ మాసంలో భక్తుల విన్నపాలను, ప్రార్ధనలను అల్లా స్వీకరిస్తాడని నమ్ముతారు. కఠినమైన ఉపవాస దీక్షతో  పాటు 5 పూటలు నమాజ్ చేస్తారు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో ఇఫ్తార్‌తో ఉపవాసం (రోజా) ముగిస్తారు. రోజంతా మంచినీళ్లు కూడా తీసుకోరు. అయితే రోజా లేదా ఉపవాసం ఎందుకు? ఎప్పటి నుండి ప్రారంభమైందనేది ఇప్పుడు చూద్దాం..
ramadan-month-when-it-starts-as-per-islamic-calendarఎందుకు ఉపవాసాలు ఉంటారు..
రంజాన్ అనేది దయ, పుణ్యం, ఆదాకు వేదిక అయిన మాసం. ఈ మాసంలో అల్లా ఆరాధనలో ఉంటూ పుణ్యం పొందుతారు. ఇస్లామిక్ క్యాలెండర్ లో ఉన్న ప్రకారం రంజాన్ తొమ్మిదవ నెల. ఈ క్యాలెండర్‌లో ప్రతి మాసానికి 29 లేదా 30 రోజులు ఉంటాయి. 29 రోజుల ఉపవాసాల తరువాత చంద్రుడు కనిపిస్తేనే 30వ రోజున రంజాన్ పండుగ  చేసుకుంటారు. చంద్ర దర్శనం అవకపోతే ఆ మరుసటి రోజు కూడా ఉపవాసం చేస్తారు. రంజాన్ మాసం ప్రారంభం కూడా చంద్రదర్శనం మీదనే ఆధారపడి ఉంటుంది. ramadan-month-when-it-starts-as-per-islamic-calendar-1ఈ మాసంలో భక్తులు తమలో ఉన్న చెడు, ద్వేషాన్ని పోగొట్టుకుందుకు ప్రయత్నిస్తారు. ఖురాన్ పఠనం, అల్లా ఆరాధన, నమాజ్, చేస్తారు.ఈ నెలలో మంచి కార్యాలు, దానాలు చేసి పుణ్యం పొందేందుకు పోటీ పడతారు. తమ కోరికలకు కళ్లెం వేసి ఆత్మను శుభ్రం చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏడాది అంతా చేసిన పాపాలను అల్లా క్షమిస్తాడని నమ్ముతారు.
ramadan-month-when-it-starts-as-per-islamic-calendar-2ఎప్పుడు ప్రారంభమయ్యాయి..
ఈ ఉపవాసాల చేయడం రెండవ శకంలో మొదలు అయ్యింది. పవిత్రమైన ఖురాన్ 2వ సూరాహ్ అల్ బఖ్రాలో ఉపవాసం గురించి ఉంది. మీ ముందు తరం ఉపవాసాలను ఎలా విధిగా పాటించారో అదే విధంగా ఈ తరం వారు కూడా విధిగా పాటించాలని అందులో రాయబడింది. ఇస్లామిక్ నమ్మకాల పరంగా మొహమ్మద్ ప్రవక్త మక్కా నుండి  మదీనా హిజ్రత్ చేసిన సంవత్సరం అనంతరం ముస్లింలకు ఉపవాసం లేదా రోజా విధి చేయబడింది. అప్పటి నుండి ముస్లింలు అందరు కూడా విధిగా ఈ ఉపవాసాలు పాటిస్తుంటారు.
ramadan-month-when-it-starts-as-per-islamic-calendar-3Also Read: ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి?


End of Article

You may also like