రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు తనకు కలిసొచ్చిన అదే జోనర్ లో సంక్రాంతి బరిలో నిలిచారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా శృతి హాసన్ నటించింది. అలానే విలన్‌గా కన్నడ నటుడు దునియా విజయ్ నటించాడు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

Video Advertisement

 

 

ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి అన్ని పాటలను రాసారు. లెజెండ్ సినిమాలో కూడా అన్ని పాటలను రామజోగయ్య శాస్త్రి రాసారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి శిష్యుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి.. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి. అయితే ఆయన ట్విట్టర్ లో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన అప్‌డేట్స్ అన్నిటినీ షేర్ చేస్తుంటారాయన.

ramajogayya sastri in veerasimha reddy cameo..!!

అయితే తాజాగా ఆయన షేర్ చేసిన ఒక పిక్ వైరల్ గా మారింది. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘వీర సింహా రెడ్డి’ లో నా క్యామియో అంటూ తలపాగా చుట్టుకుని ఉన్న సూపర్బ్ పిక్ షేర్ చేశారు. అయితే ఆయన ఏ పాటలో కనిపిస్తున్నారో చెప్పలేదు కానీ.. ఆ ఫోటో చూస్తుంటే వీర సింహా రెడ్డి’ లో ‘మాస్ మొగుడు’ పాటలో కనిపించనున్నారని బాలయ్య ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ramajogayya sastri in veerasimha reddy cameo..!!

అయితే ఇంతకు ముందు కింగ్’, ‘శ్రీమంతుడు’ వంటి పలు చిత్రాల్లో పాటల్లో కాసేపు కనిపించిన ఆయన క్యామియోలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలో క్యామియో ఎంత ట్రెండ్ అవుతుందో చూడాలి. ఇప్పటికే విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలోని నాలుగు పాటలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అన్ని పాటలు మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉన్న ఈ పాటలు అన్నీ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.