రీ-రిలీజ్ అవ్వబోతున్న ఆ రామాయణం..? ఎప్పుడు అంటే..?

రీ-రిలీజ్ అవ్వబోతున్న ఆ రామాయణం..? ఎప్పుడు అంటే..?

by Mohana Priya

Ads

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో కనివిని ఎరుగని విజువల్ హంగులతో తెరకెక్కిస్తున్నాము అని చెప్పి విడుదల చేసిన చిత్రం ఆదిపురుష్. గత రెండు మూడు నెలల నుంచి ఈ చిత్రం కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూసిన అభిమానులు తీరా చిత్రం విడుదల అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ మరియు చిత్రంలోని సన్నివేశాలను తట్టుకోలేక తికమక పడ్డారు.

Video Advertisement

మర్యాద పురుషుడైన రాముడు జీవిత చరిత్ర రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లుగా చిత్రించడమే కాకుండా ఏకంగా ఆంజనేయ స్వామి దగ్గర మాస్ డైలాగులు చెప్పించి అభిమానుల మనోభావాలను దెబ్బతీశారని ఈ చిత్రంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దశకంఠుడి తలలను ద్రాక్ష గుత్తుల్లా పెట్టడం దగ్గర నుంచి…బొగ్గు గని ఉన్న లంక వరకు…. చాలావరకు సన్నివేశాలు మరియు పాత్రలు రామాయణానికి భిన్నంగా ఉన్నాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పోనీ జరిగిన తప్పుని ఒప్పుకున్నారా అంటే ఈ సినిమా రామాయణం కాదు, ఇందులో ఉన్న హనుమంతుడు దేవుడు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి పలువురి ఆగ్రహానికి గురి అయింది ఈ చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రోల్ చేయడంతో పాటు మూవీ ని బ్యాన్ చేయాలి అన్న అభిప్రాయం వెల్లువెత్తుతుంది.

ఈ నేపథ్యంలో హిందీలో 40 సంవత్సరాల క్రితం చిత్రీకరించినటువంటి రామనంద్ సాగర్ ‘రామాయణ్’ సీరియల్ ప్రస్తావన మరోసారి వెలుగులోకి వచ్చింది. హై టెక్నాలజీ లేకపోయినప్పటికీ రామనంద్ సాగర్ తీసినటువంటి ఈ సీరియల్ అప్పట్లో చాలా పాపులర్ అయింది. అయితే ప్రస్తుతం రామాయణం చుట్టూ ఉత్పన్నమవుతున్న పరిస్థితుల రీత్యా ఈ సీరియల్ ని మరోసారి టీవీలో టెలికాస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

Adipurush

ఎప్పటినుంచో పలువురు అభిమానులు ఈ సీరియల్ రీ టెలికాస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో రీ రిలీజ్ చేయబడినటువంటి ఈ సీరియల్ లాక్ డౌన్ సమయంలో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా చూస్తే ఇది ఇప్పటివరకు నెలకొన్న రికార్డులను దాటి పాపులర్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. జూలై 3 నుంచి ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది.

ALSO READ : “ఆదిపురుష్” OTT రిలీజ్ డేట్ అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?


End of Article

You may also like