రామాయణం అనగానే  రాముడి 14 ఏళ్ల అర‌ణ్య‌వాసం, రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్ల‌డం, అత‌న్ని వ‌ధించి సీత‌ను మ‌ళ్లీ వెన‌క్కి తెచ్చుకోవ‌డంఅని ఒక లైన్ లో చెప్పమంటే ఇలా చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్లోకాలు, ప‌ద్యాల‌తో కూడుకుని ఆ పురాణం ఉంటుంది.

Video Advertisement

రామాయ‌ణం, అందులోని విశేషాలు, సంఘ‌ట‌న‌లు చాలా మందికి తెలిసిన‌ప్ప‌టికీ దాదాపుగా అనేక మందికి తెలియ‌ని విష‌యం ఇంకోటుంది. అదేంటి అంటే..

రావ‌ణుడు సీత‌ను ఎత్తుకెళ్తాడు కొన్ని నెల‌ల పాటు త‌న వ‌ద్దే ఆమెను నిర్బంధిస్తాడు. అనంత‌రం రాముడు సీతను వెతుక్కుంటూ వ‌చ్చి, రావ‌ణున్ని సంహ‌రించి ఆమెను తీసుకెళ్తాడు. ఇది అందరికి తెలిసిన కథే. అయితే రావ‌ణుని వ‌ద్ద సీత ఉన్న స‌మయంలో ఆమెను రావ‌ణుడు క‌నీసం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు.  అంత‌టి రాక్ష‌సుడు అయి ఉండి కూడా రావ‌ణుడు సీత‌మ్మ‌ను అస్స‌లు తాక‌లేదు. దానికి కారణం ఏంటి అంటే.?

ఇంద్రుడి ద‌గ్గ‌ర, స్వర్గంలో ఉండే రంభ తెలుసు క‌దా? నిత్యం గానా భ‌జానాలు, మేజువాణీలు… అబ్బో ఆ వైభోగ‌మే వేరు. అయితే రావ‌ణుడు సీత‌ను తీసుకురావ‌డానికి చాలా సంవ‌త్స‌రాల ముందే అత‌ను ఓసారి స్వర్గానికి వెళ్తాడ‌ట‌. అప్పుడు అక్క‌డ ఉన్న రంభ‌ను చూసి రావ‌ణుడు మ‌న‌సు పారేసుకుంటాడు. త‌న‌తో గ‌డ‌పాల‌ని ఆమెను బ‌లవంతం చేస్తాడు. అందుకు రంభ ఒప్పుకోదు. అయినా రావ‌ణుడు వదిలి పెట్ట‌కుండా ఆమె వెంట ప‌డ‌తాడు. ఈ క్ర‌మంలో అది చూసిన రంభ ప్రియుడు న‌ల‌కుబేరుడు రావ‌ణుడికి శాపం పెడ‌తాడు.

ఇష్టం లేకున్నా ఎవ‌రైనా స్త్రీలను ముట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే అత‌ని త‌ల‌లు ప‌గిలిపోతాయ‌ని న‌ల‌కుబేరుడు రావ‌ణుడికి శాపం పెడ‌తాడు. దీంతో చేసేది లేక రావ‌ణుడు వెన‌క్కి త‌గ్గుతాడు. అప్ప‌టికది అయిపోయినా ఆ శాపం అత‌న్ని వెంటాడుతూనే ఉంటుంది. అందులో భాగంగానే సీతను ఎత్తుకెళ్లినా, అన్ని నెల‌ల పాటు త‌న వ‌ద్ద బందీగా పెట్టుకున్నా ఆమెను కనీసం తాక‌ను కూడా తాక‌లేక‌పోతాడు. ఇదండీ అసలు కథ. ఇలాంటివి ఇంకెన్నో తెలుసుకోవాలి అంటే మా వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి.