రానా దగ్గుబాటి…! హీరోనా..? విలనా..?

రానా దగ్గుబాటి…! హీరోనా..? విలనా..?

by Anudeep

Ads

తెలుగు సినిమాలలో ఒకప్పుడు హీరోలు, విలన్లు, హాస్య నటులు అంటూ విడివిడిగా కనిపించేవారు. ప్రతి ఆర్టిస్ట్ తాము ఏ పాత్రకి సరిపోతామనుకునే వారో ఆ పాత్రలోనే నటించేవారు.

Video Advertisement

కానీ రాను రాను తెలుగు సినిమా పరిధి విస్తరించింది. ఆ విధంగానే తెలుగు నటులు కూడా తమ పరిధిని పెంచుకుంటున్నారు. కథానాయకుల , ప్రతి నాయకులు గాను, ప్రతి నాయకులు కథానాయకులు గాను నటిస్తూ, మెప్పిస్తూ విజయవంతమైన చిత్రాలు చేస్తున్నారు.

ప్రస్తుత తరం నటుల్లో, హీరోగాను, విలన్ గాను నటిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న నటుడు రానా. రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రానా, హీరోగా లీడర్ లాంటి అద్భుతమైన కథా ప్రధాన్యమున్న సినిమాతో పరిచయం అవ్వడం టాలీవుడ్ ప్రేక్షకులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది. మొదటి సనిమా తోనే రానా తన అభిరుచి ఏంటో ప్రేక్షకులకి తెలియజేశాడు. తన తర్వాత సినిమా లు కృష్ణం వందే జగద్గురుమ్, నేను నా రాక్షసి, నేనే రాజు నేను మంత్రి, ఘాజీ లాంటి సినిమాలు చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే రాణా లక్ష్యం గా కనిపిస్తుంది.

ఒక పక్క హీరో గా మంచి ఫామ్ లో ఉండగానే దర్శక ధీరుడు రాజమౌళి రానాలోని మరొక కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు. బాహుబలి, బాహుబలి 2 లతో రాణాని బలమైన ప్రతి నాయకుడి గా తెలుగు తెర పై ఆవిష్కరించాడు. అక్కడ నుండి రానా అటు హీరో గా, విలన్ గా జోడు గుర్రాల స్వారీ విజయవంతంగా చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా  నాయక్ సినిమాలో ప్రతి నాయక ఛాయలున్న పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించాడు.

సాధారణంగా పవన్ కళ్యాణ్ పక్కన నటించే వేరే ఏ ఆర్టిస్ట్ ని ఆయన అభిమానులు అంతగా లెక్కలోకి తీసుకోరు. కానీ రానాని మాత్రం పవన్ అభిమానులు కూడా పొగడ్తలతో ముంచెత్తారు.

ఇటీవల అరణ్య సినిమాలో వన సంరక్షకుడిగా నటించిన రానా ఆ సినిమా పరాజయం పొందినప్పటికి నటుడి గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇపుడు కూడా పేద ప్రజలకు న్యాయం చేసే కామ్రేడ్ రవన్నగా విరాట పర్వం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

హీరో, విలన్ పరిధులు దాటి ఒక మంచి నటుడిగా నిలదొక్కుకునే ప్రయాణంలో రానా ఎప్పటికప్పుడు అభివృద్ధి సాధిస్తున్నాడు అని చెప్పుకోక తప్పదు.


End of Article

You may also like