రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ఈ సినిమా తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల అవుతుంది. ఆ ట్రైలర్ కూడా ఇవాళ విడుదల చేశారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

Video Advertisement

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అలాగే కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో నటించారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖ నటులు ఈ సినిమాలో ఉన్నారు.

ranbir

సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక మైథాలజీ అలాగే యాక్షన్ కూడా ఎక్కువగా ఉండబోతోంది అని అర్థమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే చాలా మందికి నాగార్జున హీరోగా నటించిన ఢమరుకం సినిమా కూడా గుర్తొచ్చింది. అంతే కాకుండా.. ఈ సినిమాలో కొన్ని పాత్రలు మార్వెల్ సినిమా పాత్రలను పోలి ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ranbir 1

తాజాగా వీటిపై రణబీర్ కపూర్ స్పందించారు. రణబీర్ బ్రహ్మాస్త్రాన్ని ఏ సినిమాతోనూ పోల్చలేమని స్పష్టం చేసారు. ఇది మార్వెల్ చిత్రం లాంటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన ఏ చిత్రంతో ‘బ్రహ్మాస్త్ర’ను పోల్చలేము. ఇతర దేశాల పెద్ద సినిమాలను నేను కూడా చాలా చూసాను. కానీ.. ఈ సినిమాలో వాటి గురించిన ప్రస్తావన ఉండదు అని స్పష్టం చేసారు.