ప్లీజ్..ప్లీజ్…ప్లీజ్…దయచేసి సహాయం చేయండి…లైవ్ లోనే ఏడ్చేసిన రష్మీ! కారణం ఇదే.!

ప్లీజ్..ప్లీజ్…ప్లీజ్…దయచేసి సహాయం చేయండి…లైవ్ లోనే ఏడ్చేసిన రష్మీ! కారణం ఇదే.!

by Sainath Gopi

జబర్దస్త్ అంటే రశ్మి, రశ్మి అంటే జబర్దస్త్ అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ కి గుర్తింపు రావడం చిన్న విషయం కాదు. తెలుగు యాంకర్ గా రశ్మిది బుల్లితెరపై ప్రత్యేక స్థానం. అడపా దడపా తెలుగు సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది . మరోవైపు సోషల్ మీడియాలో కడా యాక్టివ్ గా ఉంటూ సోషల్ ఇష్యూస్ పై తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.

Video Advertisement

ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. దీంతో ఎంతో మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చెర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ ఇబ్బందులు తప్పట్లేదు. కొంతమందికి కనీసం ఆహరం కూడా దొరకట్లేదు. ఈ విషయంపై రష్మీ కామెంట్స్ చేసారు.

పేదలకు తిండి దొరకట్లేదు. దయచేసి అందరు విరాళాలు ఇవ్వండి అని కోరారు రష్మీ. విరాళాలు అంటే పెద్ద మొత్తంలోనే ఇవ్వాల్సిన పని లేదు. ఒక్క రూపాయి ఇచ్చిన కూడా సాయమే అవుతుంది. ప్లీజ్‌ ప్లీజ్‌ ప్లీజ్‌ వారికి సాయం చేద్దాం అని రష్మీ కోరింది. మన ఇంటి పరిసరాల్లో ఉండే పేదలకు కూడా సాయం చేద్దామని పిలుపునిచ్చింది. ఇటువంటి పరిస్థితి సమాజంలో ఎప్పుడు చూడలేదు. సహాయం చేస్తూ విరాళాలు అందిస్తున్న అందరికి కృతజ్ఞతలు తెలిపింది రష్మీ. రష్మీ చేస్తున్న ఈ పని పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్మీ చాలా ఎమోషనల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video:


You may also like

Leave a Comment