ప్రముఖ కోలీవుడ్ హీరో, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత జరుగుతున్న విమర్శల గురించి అందరికీ తెలిసిందే. “సనాతన ధర్మం అనేది ఓ రోగం లాంటిది. దాన్ని నిర్మూలించాలి” అంటూ ఉదయనిధి చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Video Advertisement

ఉదయనిధి పై సామాజికంగా, రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో గతంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. యాంకర్ రష్మీ గౌతమ్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్ల గురించి మాట్లాడిన మాటలను షేర్ చేసింది. దాంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్ట్ యాంకర్ గా పాపులర్ అయిన రష్మి, పలు సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి, పలు సందర్భాల్లో సొసైటీ పరిస్థితుల మీద  స్పందిస్తూ ఉండడం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్లను దూషించడం ఎక్కువైందని, అలా దూషించడం తప్పని చెప్పిన మాటలను రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.  అప్పటి నుండి ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
రష్మి తన పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది. తాను ఈ పోస్ట్ చేయగానే టార్గెట్ చేస్తున్నారని, తాను తన నమ్మకాలు, ఇష్టాల గురించి చెబితే, ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారని, దేవుళ్లను మీరు ఎందుకు నమ్మరని అడిగానా? అంటూ ప్రశ్నించింది. తాను దేవుడ్నినమ్మితే మీరేందుకు అడుగుతున్నారు.

ఏ మతం సరైనదో చెప్పండి. ఇతర మతాల్లో ఇటువంటి సమస్యలు లేవా? అక్కడ కూడా ఇలాంటి అతివాదులు లేరా? మీ కుటుంబాన్ని మార్చుకోలేరు. అందులో చాలా సమస్యలుంటాయి. ప్రతీ ఒక మతానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఎవరి జీవితాన్ని వారిని జీవించనివ్వండి. నా దేవుళ్లని మరియు నా విశ్వాసాలను ధూషించకండి అంటూ యాంకర్ రష్మీ ట్వీట్ లో పేర్కొంది.

Also Read: అదే పాట..! ఇంకా ఎన్ని రోజులు ఇదే చెప్తాడు..?