హీరోహీరోయిన్ల మీద బ్యాన్ విధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అదీ టాప్ రేంజ్‌లో దూసుకుపోతూ నేషనల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ల మీద బ్యాన్ వేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. అలా కన్నడ పరిశ్రమ రష్మిక మీద బ్యాన్ వేసిందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశంపై స్పందించింది నేషనల్ బ్యూటీ రష్మిక.

Video Advertisement

 

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులోపాతుకుపోయిన హీరోయిన్ రష్మిక మందన్న. ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోలందరితో జతకట్టింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు అంతటా రష్మిక హవానే నడుస్తోంది. అయితే చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన కాంతార సినిమా రష్మికను కాస్త కలవరపాటుకు గురిచేసింది.

rashmika comments about banning her from kannada industry..

ఆ చిత్రాన్ని తాను చూడలేదు అని రష్మిక చెప్పడంతో.. కన్నడిగులు సీరియస్ అయ్యారు. వెండితెరకు పరిచయం చేసిన కన్నడ ఇండస్ట్రీని రష్మిక విస్మరించిందంటూ మండిపడ్డారు. మరో సందర్భంలో తన ఫస్ట్ ప్రొడక్షన్ కంపెనీ పేరు చెప్పేందుకు కూడా రష్మికకు మనసు రాలేదు. దీనిపై దర్శకుడు రిషభ్ శెట్టి కూడా కౌంటర్లు వేశాడు. అలా ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరకు రష్మికను బ్యాన్ చేశారంటూ వార్తలు కూడా వచ్చాయి.

rashmika comments about banning her from kannada industry..

అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించింది రష్మిక. ” విడుదలైన రెండు మూడు రోజుల్లోనే సినిమాను చూశారా? అని అడిగారు.. నేను అప్పటికి చూడలేదు.. అదే విషయాన్ని చెప్పాను.. ఈ మధ్యే సినిమాను చూశా.. బాగుందని టీంకు మెసెజ్ పెట్టా.. థాంక్యూ అని అటు నుంచి రిప్లై కూడా వచ్చింది. నా వ్యక్తిగత విషయాలను నేను అందరికి చెప్పాలి అనుకోను. వృత్తి పరంగా మాత్రం ప్రతి విషయాన్నీ అందరికి చెప్పడం నా బాధ్యత. ప్రస్తుతానికైతే నన్ను ఎవరూ బ్యాన్ చెయ్యలేదు. ” అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

rashmika comments about banning her from kannada industry..

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ సంపాదించుకుంది నేషనల్ క్రష్. ఈ మూవీతో దేశంలోనే కాకుండా ప్రపంవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో అటు దక్షిణాదిలోనే కాకుండా.. బీటౌన్‏లోనూ వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం రష్మిక పుష్ప 2 లో నటిస్తోంది. తమిళం లో ఆమె నటించిన వారిసు చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే హిందీ లో చేసిన మిషన్ మజ్ను చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.